7 రోజులూ 100 కోట్లు : ఎన్టీఆర్ స్టామినా ఇదీ

టాక్ కీ కలక్షన్లకీ సంబంధం లేని సినిమాలు కొన్ని ఉంటాయి. ‘జస్ట్ యావరేజ్ ‘ అనే టాక్ వచ్చినా సినిమా ఆడిస్తోంది అంటే… అది కేవలం హీరో స్టామినా అనుకోవాలి అంతే. ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయం లోనూ అదే జరుగుతొంది. జనతా ఫస్ట్ డే టాక్ చూసి చిత్ర బృందం కూడా భయపడింది. రెండో రోజే సక్సెస్ మీట్ పెట్టి… తన భయం చాటుకుంది. అయితే … మెల్లమెల్లగా రికార్డుల వైపుకు దూసుకెళుతూ అందరి అంచనాలని తారుమారు చేసేసింది గ్యారేజ్. 4 రోజులకి 50 కోట్లు కొల్లగొట్టి బాహుబలి తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్ల షేర్ సాధించిన చిత్రంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో రికార్డ్ సొంతమైంది. 7 రోజుల్లో 100 కోట్ల షేర్ సాధించి… అల్ టైం రికార్డుల్లో 2వ స్థానం లోకి వెళ్లి కూర్చుంది. బాహుబలి కేవలం 5 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

జనతా తొలి రోజు టాక్ తో పోల్చి చూస్తే…. ఈ వసూళ్లు అద్భుతమే అని చెప్పాలి. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఈ అంకెలను ఊహించలేదు. ఇది వరకు ఎన్టీఆర్ సినిమా… అంటే హిట్ కొట్టాల్సిందే. యావరేజ్ లి నడిచేవి కావు. మంచి సినిమాలు కూడా హిట్ టాక్ లేక పోవడం తో … కలక్షన్ల వేటలో చతికిలపడేవి. కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది. నాన్నకు ప్రేమతో సినిమానీ ఎవరూ హిట్ అనలేదు. డివైడ్ టాక్ భయంకరంగా నడిచింది. కానీ అది కూడా 50 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు జనతా తో అదే మ్యాజిక్ కంటిన్యూ అయ్యింది. అంటే …. ఎన్టీఆర్ రేంజ్ ఊహించని విధంగా మారుతొంది అన్న మాట. ఎన్టీఆర్ స్టామినా కట్టెలు తెంచుకుందన్న మాట. ఇక రికార్డులకు అడ్డేముంది ? జయహో ఎన్టీఆర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close