మీడియా వాచ్‌: ఆ దిన ప‌త్రిక మూసేస్తారా?

ఈ మ‌ధ్య తెలంగాణ‌లో మ‌రో కొత్త దిన ప‌త్రిక పుట్టింది. రంగుల పేజీల్లో.. కొంత కాలంగా అల‌రిస్తోంది. ఇప్పుడు ఆ పత్రిక వైభోగం మూడు నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోనున్న‌ద‌ని మీడియా వ‌ర్గాల్లో టాక్‌. ముందు నుంచీ ఈ పత్రిక‌కు ప్ర‌క‌ట‌న‌లు అంతంత‌మాత్ర‌మే. లాక్‌డౌన్ కార‌ణంగా అవీ చేజారిపోయాయి. గ‌త రెండు నెల‌లుగా ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు క‌రోనా ఎఫెక్టు కూడా తోడైంది. కొంత‌మంది స్వ‌చ్ఛందంగానే ఉద్యోగాలు వ‌దులుకుంటున్నార‌ని టాక్. త్వ‌ర‌లో ఈ ప‌త్రిక ని మ‌రెక‌రు హ్యాండోవ‌ర్ చేసుకుంటార‌ని, అప్ప‌టి వ‌ర‌కూ ఈ క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.

న‌మ‌స్తే తెలంగాణ లాంటి ప‌త్రిక‌కీ క‌ష్ట‌న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. క‌నీసం 20 నుంచి 30 శాతం ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో ఉద్యోగ గండం ఉంద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. జిల్లా టాబ్లాయిడ్లు ఇప్పుడు న‌వ‌డం లేదు. అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌కు హూస్టింగ్ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. బాగా ప‌నిచేసే కొద్ది మందిని మాత్రం ఉంచుకుని, మిగిలిన వాళ్ల‌ని ఇంటికి పంపించే యోచ‌న‌లో యాజ‌మాన్య ఉంద‌ని స‌మాచారం. ఈ నెల‌ఖరులోగా చాలా ఉద్యోగాలు ప్ర‌మాదంలో పడే అవ‌కాశంఉంద‌ని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close