ఎసిడిసి కాదు.,. ఫుల్ కౌంట్ నే

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

స్టార్ హోటల్ లో డిష్ ను ఇంట్లో చేయాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ తెలిస్తే సరిపోదు. చేయడం చాత కావాలి. అలాగే సినిమాను రీమేక్ చేయాలి అనుకునే ముందు మాతృక చూసి ఎగ్జయిట్ అయితే సరిపోదు. అసలు ఆ ఒరిజినల్ సినిమా ఎందుకు ఆకట్టుకుంది. కేవలం సబ్జెక్ట్ మాత్రమేనా, ఇంకా మరేమైనా వుందా అన్నది గమనించాలి. అంతే కానీ, ఎద్దు ఈనింది అంటే దొడ్ల సావిట్లో కట్టేయమన్న చందంగా, గుడ్డిగా ముందుకు వెళ్లిపోకూడదు.

ఏ సినిమాకు అయినా, అది రీమేక్ అయినా ఒరిజినల్ అయినా సబ్జెక్ట్ ఎంత ప్రధానమో, కాస్టింగ్ కూడా అంతే ప్రధానం. ఏ హీరో దొరకలేదు, అందుకే దొరికిన హీరోతొ చేసేసాం అన్నంత మాత్రాన, ఏ సినిమా లేదు, అందుకే ఈ సినిమా చూద్దాం అనే కనికరం జనాలకు వుండదు.

ఎబిసిడి అనే సినిమా మలయాళంలొ పెద్ద హిట్. దుల్కర్ సల్మాన్ లాంటి హీరో చేసిన సినిమా. ఈ రెండు విషయాలు చూసి, మెస్మరైజ్ అయిపోయి తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయిపోయి వుంటారు మన నిర్మాతలు. అంతవరకు బాగానే వుంది. ఆ సినిమా మనకు నప్పుతుందా? మన హీరోలు ఏ మేరకు మార్చమంటారు? ఇవన్నీ లెక్కలు వేసుకోకుండా రంగంలోకి దిగిపోతే, కామెడీ సినిమా కాస్తా ట్రాజెడీగా మారిపోతుంది.

అమెరికాలో బాగా డబ్బున్న కుర్రాడు అరవింద్ (అల్లు శిరీష్) కు మనీ వాల్యూ తెలియాలని తండ్రి ఇండియాకు పంపి లాక్ చేస్తాడు. నెలకు కేవలం అయిదు వేలు ఇచ్చి బతకమని బిగించేస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు పడిన పాట్లే సినిమా. అయితే దీనికి హీరోయిజం జోడించడం కోసం మనవాళ్లు అల్లిన ట్రాక్ వ్యవహారం వేరే.

ఎబిసిడి సినిమాకు కీలకమైన అంశాలు రెండు. ఒకటి హీరో క్యారెక్టరైజేషన్. రెండు వినోదం. తెలుగు రీమేక్ లో ఈ రెండూ మైనస్ అయ్యాయి. అదనపు మైనస్ లు ఏమిటంటే, సినిమా మిస్ కాస్టింగ్. అల్లు శిరీష్ కు హీరో గా నిలదొక్కుకోవాలని వుండొచ్చు. కానీ అతగాడిని చూడడానికి జనం ఇష్టపడాలి. లేదా అతగాడని నప్పే పాత్రలు రావాలి. ప్రతి ఒక్కరికి హీరో కావాలనే వుంటుంది. కానీ జనం యాక్సెప్టెన్సీ అనే కండిషన్ ఒకటి వుంటుంది. అల్లు శిరీష్ విషయంలో ఇదే సమస్య.

ఎబిసిడి సబ్జెక్ట్ పరంగా ఓకె అనే సబ్జెక్ట్ నే. అయితే మరింత బలమైన ఫన్ సీన్లు రాసుకోగలిగితే. కానీ దర్శకుడు ఆ దిశగా కృషి చేయాల్సింది పోయి, హీరోను యూత్ ఐకాన్ ను చేసి, హీరోయజం ఆపాదించే పని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అదే సమయంలో హీరో ఢీకొనాల్సిన విలన్ ను మరింత బలంగా రూపొందించలేకపోయాడు.

బాగా డబ్బు చేసిన హీరో స్లమ్ లో ఇబ్బందులు పడడం అన్నది తెలుగు తెరకు కొత్త కాదు. కొత్తగా అనిపించాలంటే అందుకు తగిన సీన్లు రాసుకోవాలి. అంతే కానీ నీళ్ల టాంక్ దగ్గర కొట్లాటల లాంటి అరిగిపోయిన సీన్లు కాదు. సినిమా లో హీరో ఎంట్రీ దగ్గర నంచి, అతగాడి ఫ్యామిలీ సీన్లు అన్నీ కృతకంగా వుంటాయి. ఛాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. సినిమా ఇండియాకు షిఫ్ట్ అయిన తరువాత కూడా చేతులు ఊపుకుంటూ, బ్రో..బ్రో అనుకుంటూ, ఊ..ఆ అంటూ వయ్యారాలు పోవడం చూస్తుంటే వెగటుగా వుంటుంది తప్ప నవ్వురాదు. దీనికి తోడు సినిమాలో ఎప్పుడయితే విలన్ ట్రాక్ జోడించి, దాని వ్యవహారాలు చొప్పించారో, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు అయిపోయింది. సినిమాకు సినిమాటిక్ క్లయిమాక్స్ కోసం తయారుచేసిన యూత్ ఐకాన్ ఎపిసోడ్ పెద్దగా ఆకట్టుకునేలా లేకపొయింది. దీంతో సినిమా తేలిపోయింది. సినిమా మధ్యలో నాగబాబును విలన్ గా చూపిస్తూ హీరో చెప్పే కట్టుకథ కోసం తీసిన సీన్లు చూస్తే, సినిమా కు ఈ సీన్లు చాలవా బ్రేక్ వేయడానికి అనిపిస్తాయి.

ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే, హీరో అల్లు శిరీష్ కాబట్టి, విలన్ గా అతనికి కాస్త ఓ మెట్టు కిందన వుండే నటుడు కావాల్సి వచ్చాడు. దాంతో సిరివెన్నెల రాజా ను తీసుకున్నారు. అతగాడి విగ్రహం బాగానే వుంది. కానీ నటన వరకు వస్తే, హీరోనే బెటర్ కదా అనిపించేసాడు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో అతగాడి నటన హైలైట్ అనుకోవాల్సిందే.

ఇక సినిమాకు హీరోయిన్ కావాలి కాబట్టి, ఏదో ఒక ట్రాక్ రాయాలి కాబట్టి రాసారు. చేసారు. అంతకు మించి ప్రాధాన్యత లేదు.

మరి హీరో ఇలా వుండి, విలన్ అలా వుండి, హీరోయిన్ వ్యవహారం ఇదైతే, మరి పరిస్థితి ఏమిటి?

సినిమా కాస్టింగ్, సబ్జెక్ట్ ఇలా వుంటే, నిర్మాణ విలువలు కూడా అలాగే వున్నాయి. చిన్న క్యారెక్టర్ వుందంటే చాలు, దారంటపోయేవాళ్లను తీసుకువచ్చి చేయించేసినట్లుంది వ్యవహారం. ఎసిపి క్యారెక్టర్ వేసిన నటుడిని చూస్తే, ఎసిపినా? హోమ్ గార్డ్ నా అన్న అనుమానం జనాల్లో కలిగింది అంటే అది వాళ్ల తప్పు కాదు. ఇలా దాదాపు చిన్న క్యారెక్టర్లు అన్నీ అదే టైపు. ఇలాంటి నవ్వుల సినిమాకు కాస్త ఫన్ , ఎంటర్ టైన్ మెంట్ కోసం పాటలన్నా వుండాలి. కానీ ఒక్క పాట మినహా మరే పాట అయినా నచ్చితే ఒట్టు. మెల్ల మెల్లగా గుండెల్లో…అన్న పాట ఒక్కటే. మిగిలిన పాటలు అన్నీ బయటకు వెళ్లి రిలాక్స్ అవ్వడానికే.

ఫినిషింగ్ టచ్……సినిమా తీసి తీరాలని తీయకూడదు. సినిమా తీస్తే మనదైన మార్కు వుండాలి అన్నట్లు తీయాలి. పేకాటలో కూర్చున్నాం, ఏసిడిసి ఆడేద్దాం అనుకంటే ఫుల్ కౌంట్ ఇచ్చేయాల్సి వస్తుంది. ఇదిగో ఇలా.

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close