మాట చెల్లట్లేదా ? – టీడీపీకి, బీజేపీకి మధ్య ఆంధ్రజ్యోతి ఆర్కే పుల్లలు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ ఆదివారం ప్రధాని మోదీని పెనుభూతంతో పోల్చి కొత్తపలుకు రాసేశారు. బీజేపీతో టీడీపీ పొత్తులో ఉన్న సమయంలో ప్రధాని మోదీపై ఒక్కసారిగా ఎందుకు ఇంత వ్యతిరేకంగా రాశారు అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆర్కే తన కొత్త పలుకులో ఎప్పటికప్పుడు రాజకీయ ఎజెండా చేరుస్తూనే ఉంటారు. అందులో వింతేమీ ఉండదు. మరి ఇలాంటి సమయంలో మోదీకి వ్యతిరేకంగా ఎందుకు రాసినట్లు ?

దీనికి టీడీపీలో ఉన్న వారికి సులువుగానే సమాధానం దొరుకుతోంది. 2019 ఎన్నికల సమయంలో తమ సలహాలతో చంద్రబాబు ఎన్నికల వ్యూహాల్ని ఆర్కే ప్రభావితం చేశారు. కానీ ఈ సారి ఆయన మాటల్ని చంద్రబాబు వినడం లేదు. పొత్తులు అయినా అభ్యర్థుల విషయం అయినా ఆర్కే చేస్తున్న అనేక సిఫారసును చంద్రబాబు పట్టించుకోలేదు. అందుకే.. ఆర్కే.. బీజేపీతో పొత్తుపై కాకుండా.. బీజేపీపైన, మోదీపైన వ్యతిరేకంగా రాస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మోదీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ పార్టీతో విడిపోతేనే మంచిదని ఫీడ్ బ్యాక్ ఇచ్చి ప్రభావితం చేసింది ఆర్కేనేనని చెబుతారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలవడం వెనుక ఆర్కే సలహాలు, సూచనలు చంద్రబాబు తీసుకోలేదు. ఇచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని అంటున్నారు.

అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్కే కొన్ని సిఫారసులను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు కానీ.. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తామని.. టిక్కెట్లు ఖరారు చేయించాలని కొంత మంది ఆయనను సంప్రదిస్తే.. ఈ లాబీయింగ్ ఆయన చేశారు. కానీ చంద్రబాబు అంగీకరించలేదని చెబుతున్నారు. చంద్రబాబు ఈ సారి సొంత సర్వేల ప్రకారం, సొంత ప్రకారమే టిక్కెట్లు ఖరారు చేశారు. ఆర్కే వంటి వారి సిఫారసులు వినలేదు. ఈ అసంతృప్తి కూడా ఆర్కేలో ఉందని టీడీపీ నేతలంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి , ఏబీఎన్ ఎంత మేలు చేశాయో కానీ చేసి కీడు మాత్రం ఎక్కువగానే ఉంటుందన్న అసంతృప్తి టీడీపీ క్యాడర్ లో ఉంది. ఇప్పుడు పొత్తులో ఉన్న సమయంలో బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా రాస్తూ.. టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని మరింత ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఆయన సలహాల్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని అవగాహన ఉన్న వాళ్లు మాత్రం.. కాస్త రిలీఫ్ ఫీలవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close