అల్లు సినిమా: నిన్న – నేడు – రేపు

అల్లు శిరీష్ సినిమా వ‌చ్చి చాలా కాలమైంది. ‘ఊర్వ‌శివో రాక్ష‌సివో’ త‌ర‌వాత త‌న సినిమా ఒక్క‌టీ థియేట‌ర్ల‌లో రాలేదు. `టెడ్డీ` అనే సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఆ సినిమా గురించిన ఎలాంటి అప్ డేటూ లేదు. బ‌హుశా కొత్త యేడాదిలో ఈ సినిమాని విడుద‌ల చేయొచ్చు. ఇప్పుడు మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కి ప‌చ్చ జెండా ఊపాడు శిరీష్‌. లోకేష్ అనే ఓ ద‌ర్శ‌కుడి క‌థ‌కు శిరీష్ ఓకే చెప్పాడు. ఇదో టైమ్ ట్రావెల్ జోన‌ర్‌లో సాగే స్టోరీ. ఈ సినిమాకి ‘నిన్న – నేను – రేపు’ అనే టైటిల్ పెట్టారు. భూత భ‌విష్య‌త్ వ‌ర్త‌మానాల్లో జ‌రిగే క‌థ ఇది. పాస్ట్, ఫ్యూచ‌ర్ రెండింటినీ ఈ క‌థ‌లో చూపించ‌బోతున్నారు. స్క్రిప్టు ఆల్రెడీ సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ బ‌య‌ట‌కు రాబోతోంది. ‘టెడ్డీ’ కూడా ఓ కొత్త త‌ర‌హా క‌థే! ల‌వ్, యాక్ష‌న్ అనే రెగ్యుల‌ర్ జోన‌ర్‌లో సినిమాలు చేయ‌కుండా డిఫ‌రెంట్ గా ప్ర‌య‌త్నించ‌డ‌మే.. శిరీష్‌కి మంచిది. అప్పుడే త‌న‌దైన ఓ ముద్ర వేయ‌గ‌ల‌డు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close