అ.అ.ఆ… ఏముందీ లుక్‌లో.??

ప్రేక్ష‌కులు, చిత్ర‌ప‌రిశ్ర‌మ‌… అంతా కొత్త‌ద‌నమే కోరుకుంటోంది. టైటిల్ ద‌గ్గ‌ర్నుంచి.. పోస్ట‌ర్ వ‌ర‌కూ, ఫ‌స్ట్ లుక్ నుంచి – ఎండ్ టైటిల్స్ వ‌ర‌కూ ప్ర‌తీ చోటా… అది క‌నిపించాల్సిందే. లేదంటే `పాత స‌రుకు` లిస్టులో చేర్చేస్తున్నారు. ఇప్పుడు `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` సినిమాకి సంబంధించిన లుక్ వ‌చ్చింది. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. ఇలియానా క‌థానాయిక‌. ర‌వితేజ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. దానికి త‌గ్గ‌ట్టు… ఈరోజు ఫ‌స్ట్ లుక్‌లో ర‌వితేజ మూడు గెట‌ప్పుల్లో వ‌చ్చేశాడు. అక్బ‌ర్ పాత్ర‌కు టోపీ పెట్ట‌డం మిన‌హాయిస్తే… మూడు గెట‌ప్పులూ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. పేక ముక్క‌ల్లో హీరో బొమ్మ‌ని చూపించ‌డం కూడా ఓల్డ్ కాన్సెప్టే. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. టైటిల్‌, కాంబినేష‌న్ చూసి ఫ‌స్ట్ లుక్ నుంచే ఏదో స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంద‌ని ఆశ‌తో ఎదురు చూశారంతా. ఈ లుక్‌లో అదేం క‌నిపించ‌లేదు. కేవ‌లం ఒక్క పాత్ర‌పై ఫోక‌స్ చేసినా బాగుండేదేమో..? సినిమాలు, టైటిళ్లు మారినా ర‌వితేజ గెట‌ప్పులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయ‌న్న విమ‌ర్శ ఉంది. ఆయ‌న త‌న పాత్ర తీరుని మార్చుకోవ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డు. క‌నీసం హెయిర్ స్టైల్ విష‌యంలోనూ మార్పులు ఉండ‌వు. ఒకే సినిమాలో మూడు గెట‌ప్పుల్లో క‌నిపించాల్సిన‌ప్పుడు కూడా గెట‌ప్ విష‌యంలో ర‌వితేజ ఎందుకు శ్ర‌ద్ద తీసుకోలేదో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com