అన‌సూయ ‘క‌ర్మ‌’ సిద్ధాంతం ఎవ‌రి గురించో..?

ఈరోజు అన‌సూయ ఓ ట్వీట్ చేసింది. ”అమ్మ‌ని అన్న ఉసురు ఊరికే పోదు.. క‌ర్మ కొన్నిసార్లు రావ‌డం లేట‌వ్వొచ్చేమో గానీ, రావ‌డం మాత్రం ప‌క్కా” అని. ఇలా న‌ర్మ‌గ‌ర్భంగా ట్వీట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అన‌సూయ ఏదైనా ముక్కుసూటిగా తేల్చుకొనే త‌త్వం. కానీ.. ఇప్పుడు ఎవ‌రినో ఉద్దేశించి ప‌రోక్షంగా ట్వీట్ చేయ‌డం కాస్త వింత‌గా ఉంది. అయితే నెటిజ‌న్లు మాత్రం ఈ ట్వీట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని లింక్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాల్లోనూ. ప్ర‌మోష‌న్‌లోనూ `అమ్మ‌`నా బూతులు దంచి కొట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అప్ప‌ట్లో ఈ విష‌య‌మై పెద్ద రాద్ధాంతం కూడా జ‌రిగింది. అన‌సూయ కూడా విజ‌య్ పై ప‌రోక్షంగా చుర‌క‌లు వేసింది. ఇప్పుడు మ‌రోసారి… ఆ విష‌యాన్ని ప్ర‌స్తావ‌న‌కు తెచ్చింది. ఈరోజు ‘లైగ‌ర్‌’ విడుద‌లై. డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకొన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇదో పెద్ద ప్లాప్‌. అందుకే ”ఆరోజు అమ్మ‌ని తిట్టావ్‌.. అందుకే ఇప్పుడు శిక్ష అనుభ‌విస్తున్నావ్‌” అనే రేంజ్‌లో అన‌సూయ ఈ ట్వీట్ చేసింది. అన‌సూయ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. విజ‌య్ కోస‌మేనా ఇది.. అంటూ చాలామంది రీట్వీట్లు చేస్తున్నారు. అయితే ”జ‌బ‌ర్ ద‌స్త్ వేదిక‌పై నువ్వు చేసిందేమిటి? పొట్టి దుస్తులేసుకొని కుర్రాళ్ల‌ని రెచ్చ‌గొట్ట‌లేదా, డ‌బుల్ మీనింగ్ గైలాగులు వ‌ద‌ల్లేదా..” అంటూ సెటైర్లు వేస్తున్నారు. అన‌సూయ అంత‌ర్లీనంగా ఏం చెప్పాల‌నుకొందో గానీ, ఈ ట్వీట్‌ని ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాళ్లు అన్వ‌యించుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close