ఏం చేస్తే ఏమవుతుందో..? ఏమీ చేయకపోతేనే బెటరనుకుంటున్న ఏపీ యంత్రాంగం..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ 11వ తేదీనే ముగిసింది. కౌంటింగ్ మే 23న జరుగుతుంది. అప్పటిదాకా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. మామూలుగా అయితే ప్రభుత్వం నిర్దేశించిన పనులు, ప్రజలకు ఇబ్బంది రాకుండా వ్యవహారాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ… ఇక్కడ సీఎస్ కీలకం. సీఎస్‌గా… కొత్త అధికారిని ఈసీ నియమించడంతో.. ఆయన ఎక్కడికక్కడ పాలన ఆగిపోవాలన్నట్లుగా… అధికారులపై పెత్తనం చేస్తూండటంతోనే అసలు సమస్య వచ్చింది. నియమావళి అమల్లో ఉండడంతో కొత్త నిర్ణయాలు చేసే అవకాశం లేదు. కానీ ఉన్న వాటిని అమలు చేయాలి. అమల్లో ఉన్న పథకాలకూ అడ్డుపుల్ల వేస్తున్నారు. రోజువారీ నిర్ణయాలు కూడా జరగడం లేదు. ఓ పక్క తాగునీటి ఎద్దడి ముంచుకొచ్చింది.. గృహ నిర్మాణం, ఉపాధి హామీ పనుల కల్పన, కూలీలకు వేతనాల చెల్లింపు, కేంద్రం నుంచి రావలసిన నిధుల కోసం ప్రయత్నాలు.. అన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అయిపోయాయి.

పురపాలక శాఖలో పన్నులు వసూలు చేసే సర్వర్లు స్తంభించినా పట్టించుకునే దిక్కు లేదు. ఇది ఖజానాలో జమ కావలసిన డబ్బు. ఇక ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల సంగతి చెప్పక్కర్లేదు. అవీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక.. సాగుతున్న పనులు ఆగిపోయి.. అంతా స్తబ్దత నెలకొంది. పరిపాలనలో పూర్తి ప్రతిష్టంభన ఏర్పడింది. వస్తున్నాం.. వెళ్తున్నాం అన్నట్లుగా పాలనా యంత్రాంగం తీరు ఉంది. పైనుంచి చెప్పేవారు లేకపోవడం, తమకు తాము నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందోనని అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో కొన్ని అంశాలపై సమీక్ష జరిపారు. దీనిపై వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉండడంతో.. మంత్రులు సమీక్షలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వివాదాలకు తావివ్వడం ఎందుకన్న ఉద్దేశంతో అధికారులతో సమావేశాలు పెట్టడం లేదు. ఏదైనా ఈ నెలరోజుల పాటు వాయిదా వేసేస్తే పోలా.. అన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులే ఇలా ఉండడంతో.. కింద ఆయా శాఖల్లోనూ ఏ పనులూ జరగడం లేదు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలన పూర్తిస్థాయిలో ఆగిపోయింది. ఓ నెల రోజుల పాటు ఏమీ చేయకపోతేనే… బయటపడతామన్నట్లుగా ఏపీ యంత్రాంగం ఉంది. ఓ రకంగా ఏపీలో పాలన పడకేసింది. అధికారులు కూడా.. తమకు చేతనైనంత రీతిలో రాజకీయాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2024 బాక్సాఫీస్ : సెకండాఫ్ పైనే ఆశ‌లు

ఈ యేడాది అప్పుడే నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. కీల‌క‌మైన వేస‌వి సీజ‌న్ స‌గానికి వ‌చ్చేశాం. సంక్రాంతిలో మిన‌హాయిస్తే స్టార్ హీరోల సినిమాలేం బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ వేస‌వి చాలా చ‌ప్ప‌గా, నీర‌సంగా,...

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్‌కు వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close