ఆర్థిక సర్వే : ఏడాదిలో ఏపీ అద్భుత ప్రగతి..!

జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని.. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయని.. పనులు లేకుండా పోయాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కానీ… ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోందని.. ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రభుత్వ పన్నుల ఆదాయం దాదాపుగా పది వేల కోట్ల రూపాయలకు పడిపోయినా కూడా.. జీఎస్‌డీపీ 12.73 శాతం పెరిగింది. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన ఆర్థిక సర్వే ప్రకారం… 2019-20లో జీఎస్‌డీపీ రూ.9,72,782 కోట్లుగా నమోదైంది. తెలుగుదేశం పార్టీ హయాంలో అంతకు ముందు ఏడాది 2018-19లో దీని విలువ రూ.8,62,957 కోట్లు మాత్రమే. అంటే జగన్ పాలన చేపట్టిన ఏడాదిలో ఏపీ జీఎస్‌డీపీ రూ.1.10 లక్షల కోట్లు పెరిగిందన్నమాట.

ఏడాదిలో ప్రజల ఆదాయం కూడా బాగా పెరిగింది. 2019-20 కాలానికి ఏపీ తలసరి ఆదాయం రూ.1,69,519. అంటే.. సగటున.. ఏపీలో ఒక్కో వ్యక్తి రూ. లక్షా డెభ్బై వేల వరకూ సంపాదించారన్నమాట. చంద్రబాబు హయాంలో… ఇది.. రూ.1,51,173 మాత్రమే ఉన్నట్లుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 మాత్రమే. అంటే.. ఏపీ దేశ సగటు కన్నా ఎక్కువ ఆదాయంతో ఉందన్నమాట. ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో… గత ఏడాది కాలంలో తాము ఏమేం చేశామో.. ఎలా నిధులు ఆదా చేశామో.. ఎలా.. అభివృద్ధి చేశామో వివరించారు.

వాస్తవానికి ఏడాది కాలంలో ఏపీలో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇసుక కొరత, ప్రభుత్వం అభివృద్ధి పనులు నిలిపివేయడం … కరోనా సహా వివిధ కారణాల వల్ల ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందన్న అంచనాలు వచ్చాయి. దీని వల్ల.. ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని చెప్పుకున్నారు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వ పన్నుల ఆదాయం దాదాపుగా పదివేల కోట్లు తగ్గింది. అయితే.. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సరే.. ప్రజలకు మాత్రం.. తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం లెక్కలు విడుదల చేసింది. మొత్తంగా చూస్తే.. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ప్రగతి పథంలో ముందుకెళ్తున్నట్లుగానే చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close