ఆదాయానికి గండి..! ఏపీకి ముందే వచ్చిన మాంద్యం…!

ప్రపంచవ్యాప్తంగా జడలు విప్పుతున్న ఆర్థిక మాంద్యం భూతం… ఆంధ్రప్రదేశ్‌ను ముందుగానే కమ్మేసిందా..?… అంటే.. అవునని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. గత నాలుగు కాలంలో ఏపీలో పన్నుల రాబడి.. గత ఏడాది.. అదే కాలంతో పోలిస్తే.. భారీగా తగ్గిపోయింది. నిజానికి… ఏటికేడు.. ఆదాయం పెరుగుతుంది. బడ్జెట్‌లో కూడా.. అవే అంచనాలు వేసుకుంటారు. కనీసం.. గత ఏడాది వచ్చినంత ఆదాయం వచ్చినా.. అది తగ్గుదల కిందే నమోదవుతుంది. అలాంటిది.. ఆదాయం తగ్గడం అంటే… అది చాలా దారుణమైన పరిస్థితి.

నాలుగు నెలల్లో 30 శాతానికిపైగా రాబడి కోత..!

ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి ఏపీకి పన్నుల ఆదాయం.. రూ. 11,102 కోట్లు వచ్చాయి. అదే గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19కి సంబంధించి… ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వచ్చిన పన్నుల ఆదాయం 19,827 కోట్లు. అంటే… రూ. 8,700 కోట్ల రూపాయల వరకు ఏపీ సర్కార్‌కు మూడు నెలల్లో ఆదాయం తగ్గిపోయింది. ఇప్పటికే ఏపీ సర్కార్ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ దగ్గర్నుంచి ఆశ వర్కర్ల వరకూ ప్రతి ఒక్కరికీ జీతాలు పెంచారు. అలాగే్.. కొత్తగా.. గ్రామ వాలంటీర్లను నియమించారు. వారందరికీ జాతాలు ఇవ్వడానికి కూడా.. ఈ పన్నుల ఆదాయం సరిపోదనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ప్రతి రంగంలోనూ… మైనస్ కనిపిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల మాంద్యం ఏపీకి ముందే వచ్చిందా..?

ఆర్థిక మాంద్యం.. ప్రభావం.. ఏపీపై గట్టిగానే పడుతోంది. అయితే.. ఏపీ మార్కెట్ అంత తీవ్రంగా అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానమై లేదు. కానీ.. ఏపీ సర్కార్ విధానాల వల్లే.. మాంద్యం ముంచుకొచ్చిందని.. సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఏపీలో కొత్త సర్కార్ పదవి చేపట్టినప్పటి నుంచి… ప్రతీ రంగం ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. ఆర్థిక వ్యవస్థను… నడిపించే.. నిర్మాణ రంగం కుదేలయిపోయింది. ఇసుక కొరతతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వ ఇంజినీరింగ్ పనులను నిలిపి వేశారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు.. ఏపీలో.. నిత్యావసరాలు తప్ప.. అత్యవసరమైతేనే ఇతర కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పన్నుల ఆదాయం పడిపోవడంలో.. ఆశ్చర్యం లేదంటున్నారు. మాంద్యం దెబ్బ.. ఏపీకి ప్రభుత్వ విధానాల వల్లే వచ్చిందంటున్నారు.

నిలకడగా పెరుగుతున్న తెలంగాణ పన్నుల ఆదాయం..!

అయితే.. ఏపీలో తగ్గిపోయిన పన్నుల ఆదాయం.. తెలంగాణలో పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం.. తొలి త్రైమాసికంలో.. తెలంగాణ ఆదాయం…14,690 కోట్లు ఉండగా… 2019-20 సంవత్సరానికి అది 17, 690 కోట్లకు చేరింది. అంటే.. రూ. మూడు వేల కోట్లు పెరుగుదల నమోదు చేసింది. ఏపీలో పరిస్థితుల కారణంగా.. పలు వ్యాపారాలు.. తెలంగాణకు తరలి వెళ్లిన ఫలితం ఇదేనని.. కొంత మంది విశ్లేషిస్తున్నారు. అయితే.. సాధారణంగా.. తెలంగాణ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం కూడా.. అదే స్థాయిలో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close