చైతూకి హీరోయిన్ దొరికేసింది

వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోతున్నాడు నాగ‌చైత‌న్య‌. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌వ్య‌సాచి’ క‌థ‌కి ఓకే చెప్పాడు చైతూ. మ‌రోవైపు మారుతితో ఓ సినిమా చేయ‌డానికి గ్నీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. క‌థ రెడీ అయిపోయింది. వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో క‌థానాయిక గా అను ఇమ్మానియేల్‌ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అజ్ఞాత‌వాసి’లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది అను. హారిక హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మంచివాడు` అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే.. టైటిల్ ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని మారుతి చెబుతున్నారు. అన్న‌ట్టు ఇదో ల‌వ్ స్టోరీ అట‌.

”భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు రెండు క‌థ‌లూ.. క‌థానాయ‌కుడి లోపాల చుట్టూ సాగేవే. అయితే.. నాగచైత‌న్య కోసం మాత్రం ఓ ప్రేమ క‌థ రాసుకొన్నా. అక్కినేని హీరోల‌కు ల‌వ్ స్టోరీలు బాగా అచ్చొస్తాయి. చైతూ కూడా ల‌వ‌ర్ బోయ్‌గా నిరూపించుకొన్నాడు. అందుకే చైతూ కోసం ప్రేమ‌క‌థ సిద్దం చేశా. అదీ ఓ కొత్త కోణంలో సాగుతుంది” అంటున్నాడు మారుతి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.