అదే నా చివ‌రి సినిమా అయ్యేదేమో : అనుష్క‌

అనుష్క‌… సౌతిండియాలోనే టాప్ హీరోయిన్‌. అనుష్క అంద‌రికీ కావాల్సిన క‌థానాయిక. అగ్ర క‌థానాయ‌కుల‌కూ త‌నే కావాలి, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కూ తానే కావాలి.. వీర‌నారి పాత్ర‌ల‌కూ అనుష్క‌నే ఆప్ష‌న్‌. అనుష్క ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు సిద్దంగా ఉన్నారు. అనుష్క కోసం కొత్త కొత్త పాత్ర‌లు, క‌థ‌లు పుట్టుకొస్తున్నాయి. అలాంటి అనుష్క ఒక‌ప్పుడు సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌నుకొంద‌ట‌. ‘నేను సినిమాల‌కు ప‌నికిరాను’ అనుకొని పారిపోవాల‌నుకొంద‌ట‌. ఈ విష‌యాన్ని అనుష్క‌నే చెప్పుకొచ్చింది.

”తొలి సినిమా సూప‌ర్ లో న‌టిస్తున్న‌ప్పుడు ప్ర‌తీ రోజూ గంద‌ర‌గోళంగా ఉండేది. ద‌ర్శ‌కుడు ఏం చెబుతున్నారో, సెట్లో ఎలా ఉండాలో, డైలాగ్ ఎలా ప‌ల‌కాలో అర్థ‌మ‌య్యేది కాదు. నేను సినిమాల‌కు ప‌నికి రాను అనిపించింది. ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా వెళ్లిపోవాల‌నిపించింది. క‌నీసం సూప‌ర్ అయ్యేంత వ‌ర‌కూ ఓపిక తెచ్చుకొని.. ఆ త‌ర‌వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేద్దామ‌నుకొన్నా. ఆ స‌మ‌యంలో పూరి జ‌గ‌న్నాథ్‌, నాగార్జున ఇచ్చిన స‌హ‌కారం మ‌ర్చిపోలేను. వాళ్లే క‌నుక ఓపిగ్గా న‌న్ను భ‌రించ‌కుండా నా తొలి సినిమానే చివ‌రి సినిమా అయ్యేది” అంటూ ఒక్క‌సారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయింది స్వీటీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close