శ్రీవారి ప్రసాద లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని.. నెయ్యిగా కాకుండా కెమికల్స్ ను సప్లయ్ చేసి వందల కోట్ల సొమ్మును దిగమింటిన వైనంలో సూత్రధారుల్ని వదల కూడదని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూడున్నర గంటల పాటు ఈ అంశంలో సిట్ ఇచ్చిన రిపోర్టుపైనే చర్చించారు. చిన్న అప్పన్నదగ్గర కు వచ్చి సిట్ ఆపేసిందని.. సూత్రధారులను ఎందుకు వదిలి పెట్టాలని కేబినెట్ అఏభిప్రాయపడింది. అందుకే విచారణ కమిటీని వేయాలని నిర్ణయించింది.
కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ద్వారా సిట్ ఎక్కడ ఆపిందో అక్కడ నుంచి విచారణ చేయబోతున్నారు. కల్తీ నెయ్యిలో సూత్రధారులు ఎంత మంది ఉన్నా ఎవర్నీ వదిలి పెట్టకూడదని డిసైడయ్యారు. ఎక్కవ రోజుల పాటు విచారణ లేకుండా టెండర్ల నిబంధనలు మార్చడం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేలా కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిఫారసులు చేయనుంది. చార్జిషీటులో పేరు లేదని సూత్రధారులు సంబరపడుతున్నారేమోకానీ.. చార్జిషీట్లో పేరు లేకున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని మీడియా సమావేశం తర్వాత పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
సీబీఐ చార్జిషీటులో మొత్తం అసలు నెయ్యి లేదని కెమికల్స్ ద్వారానే తయారు చేసినట్లుగా తేలిందని చెప్పినా.. వైసీపీ క్లీన్ చిట్ వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో సిట్ తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తే.. రాష్ట్ర ప్రభుత్వానికీ లేఖ రాసింది. దీంతో… టెండర్ల అక్రమాలపై దర్యాప్తు చేసి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా చిన్న అప్పన్న కమిషన్లు వసూలు చేసి ఎవరికి డబ్బులు ఇచ్చాడో తెలుసుకుని బయటకు లాగనున్నారు. తన తో పాటు తన భార్య బ్యాంక్ డీటైల్స్ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో .. అక్కడ అసలు గుట్టు ఉందని అనుమానిస్తున్నారు.
