సీఎం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌… కూట‌మి కార్యాచ‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌త‌!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను కూడా పూర్తిగా లెక్కించాలంటూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఇది శుక్ర‌వారం విచార‌ణ‌కు వ‌స్తోంది. దీంతో ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. దీంతోపాటు, తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఎన్డీయేత‌ర పార్టీల నాయ‌కుల‌తో చంద్ర‌బాబు నాయుడు భేటీ అవుతార‌ని తెలుస్తోంది.

భాజ‌పాకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో కూట‌మి ఏర్పాట్ల‌కు సంబంధించిన కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల తేదీలు కూడా ఖ‌రారు కావ‌డంతో కూట‌మి కార్యాచ‌ర‌ణ ఏంట‌నే స్ప‌ష్ట‌త ఈ భేటీ వ‌స్తుంద‌నే ఆశాభావం వ్య‌క్త‌మౌతోంది. కోల్ క‌తా త‌ర‌హాలో భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్ణయించాల‌ని గ‌తంలో అనుకున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో వివిధ పార్టీల నేత‌లు భేటీ అవుతార‌ని అనుకున్నారు. ప్ర‌ముఖ పార్టీల నేత‌లు అందుబాటులో లేక‌పోవడంతో… ఆ భేటీ జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు రాహుల్ తో పాటు మ‌మ‌తా, కేజ్రీవాల్‌, చంద్ర‌బాబు క‌లుస్తారు. వీరంతా క‌లిసి ఇత‌ర జాతీయ పార్టీల నేత‌ల‌తో భేటీ అయ్యే అవ‌కాశం ఉంది.

భాజ‌పాయేత‌ర పార్టీల‌న్నీ ఒక కూట‌మిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఇప్పుడు ఏర్ప‌డింద‌నే చెప్పాలి. అయితే, ఇంకోప‌క్క మాయావ‌తి, అఖిలేష్ లు… ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశం కూడా నేత‌ల భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల ముందుగానే పొత్తుల్ని ప్ర‌క‌టిస్తే… ఫ‌లితాల త‌రువాత ప‌రిస్థితుల్లో అనూహ్య మార్పుల‌కు కొంత ఆస్కారం లేకుండా ఉంటుంది. ఏ పార్టీకీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాక‌పోతే… ప్రీ పోల్ అల‌యెన్స్ ఉన్న కూట‌మికే ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుగా ఆహ్వానం వ‌స్తుంద‌న్న‌ది తెలిసిందే. ఆ లెక్క‌న ఎన్డీయే కూట‌మి స్ప‌ష్టంగానే ఉంది. ఇప్పుడు, ఎన్డీయే వ్య‌తిరేక కూట‌మి కూడా ఇలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కూట‌మి కార్యాచ‌ర‌ణ‌పై కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close