కరెంట్ నష్టాలను మీరే భరించండి..! కేంద్రానికి రివర్స్‌లో ఏపీ ఘాటు లేఖ..!

ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల సమీక్ష విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను కేంద్రం పదే పదే తప్పు పడుతూండటంతో ఏపీ సర్కార్ ఎదురుదాడి ప్రారంభించింది. పీపీఏల వల్ల తమ రాష్ట్రానికి ఏటా రూ. ఐదు వేల కోట్ల నష్టం జరుగుతోందని… కేంద్రం కొంత మేర భరించాలంటూ… నేరుగా కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్‌కు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో బాలినేని పేర్కొన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌ కారణంగా ఏటా రూ.5వేల కోట్ల భారం పడుతోందని… గత నాలుగేళ్లుగా పరిమితికి మించి సోలార్‌, విండ్‌ పవర్‌ కొంటున్నామని లేఖలో పేర్కొన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌కి కేంద్రం సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌రంగంలో సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్చలు జరుపుతున్నామని.. విద్యుత్‌రంగంలో సంక్షోభానికి పరిష్కారం కోసం కేంద్రం కమిటీ వేయాలని బాలినేని లేఖలో కోరారు.

గత సర్కార్ హయాంలో జరిగిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్న ఏపీ సర్కార్ ను.. కేంద్రం పదే పదే హెచ్చరించింది. ఆ నిర్ణయాల వల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం పడుతోందని… హెచ్చరించింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు. చాలా వరకు రద్దు చేశారు. ఆయా కంపెనీలు కోర్టుకెళ్లడంలో వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఇప్పుడు… ఈఆర్సీ ద్వారా ఆ ఒప్పందాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీల విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. ఈ విషయాలపై కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ పలుమార్లు లేఖలు రాశారు. ఒప్పందాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టమైన హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నారు.

సౌర, పవన విద్యుత్ ను… ప్రభుత్వం కొనుగోలు చేయడం నిలిపివేయడంతో ఏపీ సర్కార్ విద్యుత్ సంక్షోభంలో పడింది. అదనపు విద్యుత్ కోసం.. యూనిట్ కు రూ. పన్నెండు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రూ. నాలుగుకు వచ్చే సౌర, పవన విద్యుత్ కొనుగోలు నిలిపివేసి.. అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఇలా కొనడానికి కూడా చంద్రబాబే కారణమని విమర్శలు చేస్తూ.. తమకు వచ్చే నష్టాలను కేంద్రం భరించాలంటూ.. ఏకంగా లేఖ రాసేశారు. ఏపీ సర్కార్ తీరుపై కేంద్ర ప్రభుత్వంలోనూ విస్మయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ మరో మూడు రోజుల్లో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కు బాలకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్...

రివ్యూ : రాంగోపాల్ వ‌ర్మ ‘ క్లైమాక్స్‌ ‘

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది. ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..? రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ... 'సినిమా...

జగన్ తో భేటీతో సినీ పరిశ్రమ సాధించేది ఏమీ లేదు: బాలకృష్ణ

జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ...

సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న...

HOT NEWS

[X] Close
[X] Close