ఏపీలో థియేట‌ర్ల‌కు ఊర‌ట‌

ఎట్ట‌కేల‌కు ఓ తీపి క‌బురు. ఏపీలో మూసేసిన థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకోబోతున్నాయి. ఇటీవ‌ల ఏపీలోని థియేట‌ర్ల‌పై ప్ర‌భుత్వాధికారులు దాడులు చేసి, నిబంధ‌న‌లకు వ్య‌తిరేకంగా ఉన్న థియేట‌ర్ల‌ను సీజ్‌చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సంఖ్య దాదాపుగా 85 వ‌ర‌కూ ఉంది. ఇప్పుడు ఈ థియేట‌ర్ల‌ను మ‌ళ్లీ రీ ఓపెన్ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. స్ధానిక క‌ల‌క్ట‌రేట్ కార్యాయాలకు ధియేట‌ర్ యాజ‌మాన్యం వెళ్లి, అందుకు సంబంధించిన ధ‌ర‌ఖాస్తులు పూర్తి చేయాల‌ని, జాయింట్ క‌లెక్ట‌ర్ అనుమ‌తితో థియేట‌ర్ల‌ని ఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలియ‌జేశారు.

జ‌న‌వ‌రి 7న ఆర్‌.ఆర్‌.ఆర్ రాబోతోంది. అందుకోసం థియేట‌ర్లు సిద్ధం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సీజ్ చేసిన థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకుంటాయా? లేదా? అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఇప్పుడు వాటికి క్లియ‌రెన్స్ ల‌భించిన‌ట్టైంది. అయితే… మ‌రో 200 థియేట‌ర్ల‌ని య‌జ‌మానులు స్వ‌చ్ఛందంగా మూసేశారు. ప్ర‌స్తుతం ఉన్న టికెట్ రేట్ల‌తో మా థియేట‌ర్ల‌ని న‌డ‌ప‌లేమ‌ని, వాళ్లంతా చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ 200 థియేట‌ర్లు తెర‌చుకుంటాయా, లేదా? అనేది పెద్ద స‌మ‌స్య‌. జ‌న‌వ‌రి 1న థియేట‌ర్లు మ‌ళ్లీ తెరిస్తే.. ప్ర‌భుత్వాధికారులు మ‌ళ్లీ దాడి చేసి, ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల సీజ్ చేస్తే? అప్పుడు ఎలా అన్న‌ది కొంత‌మంది థియేట‌ర్ య‌జ‌మానుల ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close