నందిని మ‌ర‌చితిరా…!

తెలుగు సినీ క‌ళాకారుల్ని గౌర‌వించుకొనే అపురూప‌మైన వేదిక నంది పుర‌స్కారాలు. అయితే తెలుగు రాష్టాలు రెండుగా విడిపోవ‌డంతో… దాని మాటే మ‌రిచిపోయారు. క‌ళ‌ల‌కు పెద్ద పీట వేస్తామంటున్న తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం కాక‌తీయ పేరుతో ఓ అవార్డుని స్థాపించి.. తెలుగు సినీ క‌ళాకారుల్ని ప్రోత్స‌హించాల‌ని చూస్తోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు త‌యారవుతున్నాయి కూడా. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే… ఉగాది రోజున ఈ విష‌య‌మై ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రావొచ్చు.

అయితే ఈ విష‌యంలో మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మీన‌మేశాలు లెక్కేస్తోంది. నంది పుర‌స్కారాలు ఇవ్వాలా, వ‌ద్దా, ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలి? నంది పేరుతోనే ఇవ్వాలా, లేదంటే కొత్త పేరుని ప్ర‌తిపాదించాలా, ఇస్తే ఎవ‌రికి ఇవ్వాలి? తెలంగాణ క‌ళాకారుల్ని కూడా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవాలా.. ఇలా స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే చాలా ఏళ్ల నుంచి నందిని పెండింగ్‌లో పెట్టేశారు. ఇప్ప‌టికైనా… కాస్త సానుకూల దృక్ప‌థంతో ఏపీ ప్ర‌భుత్వం నంది పుర‌స్కారాల‌పై ఓ నిర్ణ‌యం తీసుకొంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close