ఎన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టారో అధికారికంగా చెప్పలేరా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాక్సిన్లను సమీకరించే విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధానంగా వ్యాక్సిన్ల అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ సీఎంలు పెద్ద ఎక్కున వ్యాక్సిన్ల ఆర్డర్ పెట్టారని.. కానీ సీఎం మాత్రం కేవలం రూ. 45 కోట్లు వెచ్చించి.. పదమూడు లక్షల డోసులు మాత్రమే కొంటున్నారని ఆరోపించరాు. ఇంత కొద్ది మొత్తం వ్యాక్సిన్లతో ప్రజల్ని ఎలా రక్షిస్తారని ఆయన మండిపడుతున్నారు. ఈ అంశంపై బుధవారమే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు కానీ.. అసలు విషయం చెప్పలేదు. తామెన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టిందో చెప్పలేదు కానీ.. అసలు వ్యాక్సిన్లన్నీ కేంద్రం అధీనంలో ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఈ వివాదంలోకి విజయసాయిరెడ్డి దూసుకొచ్చారు. ఏపీ పెద్ద ఎత్తున అంటే.. నాలుగు కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టిందని కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చిన కథనాలను.. పోస్ట్ చేస్తూ.. చంద్రబాబుపై అసభ్యకరమైన లాంగ్వేజ్‌తో ట్వీట్ చేశారు. అయితే ఆయనపై నెటిజన్లు ఒక్క సారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఉండి.. పత్రికా ప్రకటలను పోస్ట్ చేయడం ఏమిటని… వెంటనే.. గవర్నర్ .. ఆయా వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ పత్రాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఏపీ సర్కార్ వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తోందని.. కేంద్రం ఇచ్చినవి మాత్రం వేస్తే సరిపోతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వ్యాక్సిన్ ధరలు ఎక్కువగా ఉండటంతో .. కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. అయితే అందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించినందున.. రూ. పదహారు వందల కోట్లు ఖర్చు పెడతామని చెప్పినందున.. తక్షణం ఆర్డర్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వెంటనే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి.. ప్రాణాలు నిలబెట్టాలనే డిమాండ్‌తో ” వ్యాక్సిన్ సరఫరా చేయండి- ప్రాణాలు కాపాడండి” పేరుతో ఆందోళనలకు చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఏపీ సర్కార్ అధికారికంగా ఎన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిందో చెబితే కానీ.. ఈ వివాదానికి తెరపడేలా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close