పోలీసు వ్యవస్థపై బండి సంజయ్ వ్యూహాత్మక ఒత్తిడి !

తెలంగాణ రాజకీయాలు అధికార వ్యవస్థపై మైండ్ గేమ్ ఆడే దశకు చేరాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవస్థలపై తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఇప్పటి వరకూ రాష్ట్ర అధికార పార్టీగా తిరుగులేని ఆధిపత్యం కొననసాగిస్తోంది. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. నేరుగా డీజీపీ మహేందర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనను దద్దమ్మగా అభివర్ణించారు.

టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నా.. బీజేపీ కార్యకర్తలపై కేసుల పెడుతున్నారని అంటున్నారు. లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షించడం చేతకాకపోతే దద్దమ్మను అని తనను తాను అంగీకరించాలని డీజీపీకి బండి సంజయ్ సవాల్ చేశారు. ఇటీవల ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్- బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసుల్లో బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వారు బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థపై ఎంత పట్టు ఉంటే అధికార పార్టీకి అంత మంచిది. ఈ విషయంలో కేసీఆర్‌ ఇప్పటి వరకూ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ అధికార పార్టీ ఆత్మరక్షణ ధొరణిలో ఉంటే పోలీసుల్లోనూ మార్పు వస్తుంది.

దీన్ని పసిగట్టిన బండి సంజయ్ .. కేంద్ర అధికార పార్టీ నేతగా.. మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ జైలుకు వెళ్తారని.. కొంతమంది పోలీస్ లు సీఎం మోచేతి నీళ్లు తాగి వారికి అనుగుణంగా పని చేస్తున్నారని వారిని వదిలి పెట్టబోమంటున్నారు. రిటైరైన తర్వాత వదలబోమని ఆయన చెబుతున్నారు. తనపై విమర్శలు చేస్తున్న పోలీసు అధికారుల సంఘాల నేతలకూ బండి సంజయ్ వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసులపై బీజేపీ పెడుతున్న ఒత్తిడి ఫలిస్తే.. టీఆర్ఎస్‌ పట్టు సడలినట్లే అవుతుంది. అదే జరిగితే .. మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close