కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్..! జనసేనలో చేర్చుకోలేదా..?

మెగా కుటంబ వీరవిధేయుడు బండ్ల గణేష్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి… ఢిల్లీ వెళ్లిన ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భక్తుడిగా చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించని .. గణేష్.. తన రాజకీయ జీవితానికి కాంగ్రెస్‌ను చాయిస్‌గా ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏది చెప్తే అది చేస్తానని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని గణేష్ ప్రకటించారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలనేదే తన జీవితాశయమని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు.

బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీపై ఎక్కడ లేని అభిమానాన్ని గణేష్ ప్రదర్శించేవారు. ఏ చానల్‌కి కానీ.. ఏ వెబ్ మీడియాకు కానీ.. ఇంటర్యూలు ఇచ్చినా.. ఏపీలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని… చెప్పుకొచ్చేవారు. వార్ వన్ సైడేనని సినిమాటిక్‌గా చెప్పేవారు. పవన్ కల్యాణ్ అనుమతిస్తే… అనుగ్రహిస్తే.. తాను ఎమ్మెల్యే, ఎంపీ అవుతానని ఆశ పడేవారు. గెలుపుపై అంత నమ్మకం ఉన్నప్పుడు బండ్ల గణేష్ ఎందుకు జనసేనలో చేరలేదన్నదానిపై.. ఆయన కూడా సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. అయితే పవన్ కల్యాణ్ అంటే.. తనకు తండ్రిలాంటి వారని చెప్పి అభిమానాన్ని మాత్రం చాటుకున్నారు. ప

ఒకప్పుడు చిన్న స్థాయి కమెడియన్‌గా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓ ఉత్తరాంధ్ర నేతకు బినామీ అన్న ప్రచారం జరిగింది. అయితే.. వీటిని గణేష్ ఖండించారు. ఆ తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ నిర్మించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతోనూ సినిమాలు తీశారు. అయితే ఇటీవలి కాలంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. చెక్ బౌన్స్ కేసులతో… కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న ప్రొద్దుటూరు కోర్టులో.. వందకుపైగా .. చెక్ బౌన్స్ కేసులున్నట్లు బయటపడిది. కోర్టుకు కూడా హాజరై వచ్చారు. ఇలాంటి వివాదాస్పద ప్రవర్తన వల్లే… పవన్ కల్యాణ్.. బండ్ల గణేష్‌ను పార్టీలోకి తీసుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close