నోటా – చెల్లని ఓట్లు ..దేనిపైనా గెలవలేకపోతున్న ఏపీ బీజేపీ !

ఈవీఎంలు అయితే నోటా.. బ్యాలెట్ అయితే చెల్లని ఓట్లతో బీజేపీ పోటీ పడుతోంది. కానీ ఎక్కడా వాటిని మించి ఓట్లు దక్కించుకుటున్న దాఖలాలు లేవు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కనీస ప్రభావం చూపించలేకపోయింది. గతంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. పట్టుబట్టి మరీ టీడీపీ నుంచి ఉత్తారంధ్ర ఎమ్మెల్సీ సీటు తీసుకుని పోటీ చేసింది. టీడీపీ ఎక్కడ వైసీపీ గెల్చుకుంటుందో అని అన్నీ తానై మాధవ్ ను గెలిపించింది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎప్పుడూ దాన్ని అంగీకిరంచలేదు. తమ సొంత బలంతో గెలిచామని విర్రవీగిపోయేవారు.

ఇప్పుడు ఎన్నికల్లో మళ్లీ అదే మాధవ్ పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నించారు . కానీ చెల్లని ఓట్లనుకూడా దాటలేకపోయారు. పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు వస్తే.. మాధవ్ పదకొండు వేల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ చెల్లని ఓట్లలో సగం కూడా బీజేపీ తెచ్చుకోలేకపోయింది. తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఆరు వేల కంటే తక్కువే. పశ్చిమ రాయలసీమలోనూ అదే పరిస్థితి. అక్కడ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు. కానీ చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి.

బీజేపీ నేతలు ఎప్పుడో నేల విడిచి సాము చేయడం అలవాటు చేసుకున్నారు. అధికార పార్టీకి అండదండగా ఉండటం తప్ప సొంత పార్టీని ముందుకు తీసుకెళదామని ఆలోచించేవారే లేరు. చివరికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన మద్దతును కూడా వారు అడగలేదు. పవన్ తో ఓ ప్రకటన కూడా చేయించుకోలేకపోయారు. కానీ.. మాట్లాడితే.. తమదే ఏపీలో అధికారమని.. ప్రాంతీయ పార్టీలు లేవని ఉదరగొడుతూంటారు.

బీజేపీ నేతలు ఈ మాటలను తక్కువ చేసుకుని ప్రజాభిప్రాయాన్ని గమనించి వారికి తగ్గట్లుగా రాజకీయాలు చేస్తే..ఎంతో కొంత బలపడే అవకాశం ఉంది. లేకపోతే.. ఇలా నవ్వుల పాలవుతూనే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close