పిడిపి వ్యాఖ్యలతో బిజెపికి ఇరకాటం!

అఫ్జల్‌ గురు ఉరితీతపై కార్యక్రమం జరిగిందంటూ జెఎన్‌యు విద్యార్థి సంఘ నాయకులపై దేశ ద్రోహ నేరం ఆరోపించి అరెస్టు చేశారు.. కాని జమ్మూ కాశ్మీర్‌లో ఆ ఉరితీతను తీవ్రంగా ఖండించిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి అధికారం పంచుకోవడం ఇప్పుడు కూడా చర్చలు జరపడం బిజెపిని ఇరకాటంలో పడేసింది. కీర్తిశేషులైన ముఖ్యమంత్రి మఫ్తి మహ్మద్‌ సయిద్‌ కూడా అఫ్జల్‌ గురు అవశేషాలను అప్పగించాలని కోరిన వారిలో ఒకరు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు చెప్పారాయన! ఇప్పుడు జెఎన్‌యు కల్లోలం అనంతరం కూడా పిడిపి సీనియర్‌ నాయకుడు రఫీ అహ్మద్‌పరా మాట్లాడుతూ తాము ఈ ఉరితీత సరికాదన్న అభిప్రాయానికే కట్టుబడివున్నామని ఆదివారం పునరుద్ఘాటించారు. బిజెపి ప్రభుత్వం ఆయన భౌతిక అవశేషాలను అప్పగించాలని కోరారు. ఆ పార్టీ యువ నాయకుడు కూడా అదే కోరారు. పిడిపి అగ్రనాయకులే బాహాటంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. గతంలో వారితో స్నేహం నెరపడమే గాక మెహబూబా మఫ్తీతో కలసి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తంటాలు పడుతున్న బిజెపి గాని కేంద్ర నాయకులు గాని దేశ ద్రోహులై పోతారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎట్టిపరిస్తితుల్లో ఇలాటి శక్తులను సహించేది లేదంటున్న హౌం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంటనే కాశ్మీర్‌ పయనం కడతారా అని అడుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close