తెలంగాణ ఉప ఎన్నిక రాబోతోంద‌న్న‌మాట‌!

తెలంగాణ‌లో నంద్యాల త‌ర‌హా ఉప ఎన్నిక ప్ర‌యోగం చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దాదాపు సిద్ధ‌ప‌డ్డ‌ట్టే క‌నిపిస్తోంది. రాష్ట్రంలో ఏదో ఒక స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హిస్తే, అధికార పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల నాడి ఏవిధంగా ఉంద‌నే స్ప‌ష్ట‌మైన అంచ‌నా వ‌స్తుంద‌ని సీఎం ఆలోచిస్తున్నారన్న‌ట్టుగా ఇటీవ‌లే క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో కూడా ప‌రిణామాలు ఒక్కోటిగా చోటు చేసుకుంటున్నాయి. పార్ల‌మెంటు స‌భ్యుడు ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో రాజీనామాకు రంగం సిద్ధ‌మైపోయింది. ఆయ‌న కూడా మంత్రి ప‌ద‌వి ఆశించే తెరాస‌లోకి చేరిన సంగ‌తి వాస్త‌వ‌మే. అయితే, స‌రైన సంద‌ర్భ‌మూ అవ‌కాశ‌మూ రాక‌పోవ‌డంతో గుత్తాకి ఎలాంటి ప‌ద‌వినీ కేసీఆర్ ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో ఇప్పుడు రైతు సేవా స‌మితుల రాష్ట్ర కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నార‌ట‌. దీనికి క్యాబినెట్ హోదా కూడా క‌ల్పించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

నిజానికి, ఈ ప‌ద‌వి ఇచ్చినంత మాత్రాన రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మైతే సాంకేతికంగా లేదు. కానీ, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక ఏ విధంగా అయితే ఒక కొత్త ఊపు తీసుకొచ్చిందో, అదే ఊపు తెరాస‌కు రావాలంటే ఇలాంటి ప్ర‌యోగం చేయాల‌ని సీఎం డిసైడ్ అయిన‌ట్టు సమాచారం. దానికి అనుగుణంగానే త్వ‌ర‌లోనే గుత్తా రాజీనామా చేస్తార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇదే విష‌యాన్ని గుత్తా ముందు ప్ర‌శ్నిస్తే… దానికి ఇంకా స‌మ‌యం ఉంద‌నీ, అలాంటి నిర్ణ‌యాలేవీ ఇప్పుడు తీసుకోలేద‌నీ, ముందుగా జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మాలు కొన్ని ఉన్నాయంటూ ఆయ‌న చెప్తున్నారు.

స్థానికంగా చూసుకుంటే.. ఇప్ప‌టికే న‌ల్గొండ లోక్ స‌భ స్థానం ప‌రిధిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక స‌ర్వే నిర్వ‌హించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడే ఎన్నిక‌ల‌కు వెళ్తే తెరాసకు 57 శాతం ఓట్లు వ‌స్తాయ‌నీ, త‌రువాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 27 శాతం వ‌స్తాయ‌ని ఆ నివేదిక‌లో తేలింది. అంటే, తెరాస‌కు తిరుగులేని మెజారిటీ ఖాయం అన్న‌దే ఆ స‌ర్వే ఫ‌లితం. ప‌రిస్థితి ఇంత పాజిటివ్ ఉంటున్న‌ప్పుడు ఎన్నిక ఎందుకు ఖ‌ర్చు దండ‌గ అనిపిస్తుంది! అయినా, నంద్యాల‌లో ఉప ఎన్నిక ఏదో ప్ర‌యోగం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌రిపించ‌లేదు క‌దా. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌విలో ఉంటుండ‌గా మ‌ర‌ణించారు. దాంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్ప‌డింది. ఉప ఎన్నిక అనివార్య‌మైంది. కానీ, ఇలా బ‌ల‌వంతంగా రాజీనామా చేయించి మ‌రీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఏంటో అర్థం కావ‌డం లేదు! ఏదేమైనా, ద‌స‌రా న‌వ‌రాత్రులు ప్రారంభం అయిన వెంట‌నే ఈ ప్ర‌యోగాత్మ‌క ఎన్నిక‌పై మ‌రింత స్ప‌ష్ట‌త రావ‌డం ఖాయ‌మని తెరాస వ‌ర్గాలు అంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close