విజయసాయి జాబ్ మేళాలో ఫేక్ జాబ్స్ -పోలీసు కేసులు !

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్నాళ్ల క్రితం జాబ్ మేళాలు నిర్వహించారు. జాతీయ , అంతర్జాతీయ కంపెనీలు వచ్చి ఉద్యోగాలిచ్చాయని ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ ఎక్కువగా ఇచ్చింది సెక్యూరిటీ ఉద్యోగాలు. అతి తక్కువ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు. ఇలా ఇచ్చిన సాఫ్ట్ ఉద్యోగాలన్నీ ఫేక్ అని..మోస పూరితం అని పోలీసు కేసులు నమోదవుతున్నాయి. విశాఖలో విజయసాయి నిర్వహించిన జాబ్ మేళాలో ఓ చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ రిక్రూట్ మెంట్లు నిర్వహించింది. విజయసాయి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు.

అయితే ఆ కంపెనీ రూ. ముఫ్పై వేల డిపాజిట్ కట్టాలని షరతు పెట్టింది. చాలా మంది కట్టారు. ట్రైనింగ్ ఇస్తామని చెప్పిన కంపెనీ పట్టించుకోలేదు. తర్వాత జీతాలివ్వడం కూడా మానేశారు. దీంతో చూసి చూసి .. వారు మీ ఉద్యోగం వద్దు.. ట్రైనింగ్ వద్దు.. మా డబ్బులు మాకిచ్చేయమని అడిగారు. కానీ ఆ కంపెనీ యజమానులు మాత్రం బెదిరించి పంపేశారు. దీంతో ఆ ఉద్యోగులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. విశాఖలో ఇలాంటి కంపెనీలు రెండు వెలుగు చూశాయి. విజయసాయిరెడ్డి నిర్వహించి జాబ్ మేళాలో జరిగిన మోసాన్ని బయట పెట్టాయి.

విశాఖతో పాటు గుంటూరు, తిరుపతిల్లోనూ విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు నిర్వహించారు. అప్పట్లో ఆయా చోట్ల సెక్యూరిటీ గార్డులు.. ఫ్యాక్టరీలో హెల్పర్ల ఉద్యోగాలే ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు విశాఖలో వ్యవహారాలు బయటకు రావడంతో ముందు ముందు ఆ రెండు జాబ్ మేళాల్లో పాల్గొన్న కంపెనీల గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ ఇష్యూ… మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూపంచాయితీ హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి మాదంటే మాదేనని ఇద్దరూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ దగ్గర అన్ని ఆధారాలు...

కాళేశ్వరంపై మరో కమిటీ… జ్యుడిషియల్ కమిటీ నిర్ణయం..?

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను పాయింట్ టూ పాయింట్ గుర్తించే పనిలో పడింది జ్యుడిషియల్ కమిషన్. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి జరిగిన అంశాలను నిగ్గు తేల్చి ఫైనల్ రిపోర్ట్ ను...

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్… ప్రమాదంపై అనుమానాలు..!

ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది....

ఎన్టీఆర్… ఎందుకంత‌ స్పెషల్ ?!

నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన హీరో... రెండు దశాబ్దాల తర్వాత కూడా అగ్రపధంలో కొనసాగడం అంటే అదొక స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌ ప్రయాణంలానే చూడాలి. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close