అప్పు సెటిల్మెంట్‌కు కేంద్ర అధికారులు.. కేబినెట్ భేటీ వాయిదా !

గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం తీసుకున్న రుణాల కిస్తీలు చెల్లించకపోవడంతో వాటి గురించి మాట్లాడటానికి ఆయా సంస్థల సీఎండీలు ఏపీకి వచ్చారు. వారు అప్పుల సెటిల్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజంతా వారు ఉన్నతాధికారులతో చర్చల్లో ఉంటారు. మధ్యాహ్నం సీఎస్‌తో కూడా సమావేశం అవుతారు. సీఎం జగన్‌తో కూడా భేటీ ఉంటుందన్న చర్చ జరుగుతుంది. అయితే ఏపీ అధికారులు చెప్పే సమాధానంతో వారు సంతృప్తి చెందితే ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఉండదని అంటున్నారు.

ఏపీ జెన్‌కోకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రుణాలిచ్చాయి. వాటికి కొంత మంది ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉండాలి. కానీ చెల్లించడం లేదు. ఎన్ని సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జెన్‌కోను డిఫాల్టర్ జాబితాలో చేర్చారు. అధికారికంగా ప్రకటించే ముందు చివరి సెటిల్మెంట్ కోసం ప్రయత్నించాలని ఏపీకి ఉన్నతాధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరు వచ్చిన కారణమో.. మరొకటో కానీ ఏపీ కేబినెట్ సమావేశాన్ని రాత్రికి రాత్రి వాయిదా వేశారు.

17వ తేదీన కేబినెట్ భేటీ ఉంటుందని అన్ని శాఖల వద్ద ప్రతిపాదనలు తీసుకుని రెడీ చేశారు. అయితే పదహారో తేదీ రాత్రి సీఎస్ సమీర్ శర్మ పేరుతో ప్రకటన విడుదలయింది. ముందుగా నిర్ణయించి.. ఎజెండా ఖరారు చేసి.. మంత్రులకు సమాచారం ఇచ్చి..అధికారులు అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాత కేబినెట్ భేటీని వాయిదా వేయడానికి బలమైన కారణం ఉండాలి. కానీ ఏ కారణం కనిపించడం లేదు. దీంతో అప్పుల వసూలుకు వచ్చిన కేంద్రం ఉన్నతాధికారులకు ఇతర అధికారులు అందుబాటులో ఉండటానికే వాయిదా వేశారన్న అభిప్రాయం అధికారవర్గాల్లో ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close