నోరు పారేసుకోవడం గొప్ప కాదు..!కేసీఆర్‌కు చంద్రబాబు కౌంటర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. చేసిన వ్యాఖ్యలు విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అత్యంత దారుణమైన భాష ఉపయోగించినా.. చంద్రబాబు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోయారు. నోరుందని పారేసుకుంటే అందరూ పారేసుకోవచ్చని .. అధికారంలో ఉండే వ్యక్తులు హుందాగా మాట్లాడాలన్నారు. రాజకీయ విలువను పాటించానని.. సంయమనంతో వెళ్లానని.. అదే పద్దతిలో వెళ్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. హైకోర్టు విభజన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినట్లు కేసీఆర్ చెబుతున్నారని.. కానీ కేంద్రం ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి ఐదు రోజుల్లో వెళ్లమంటే ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. నోటిఫికేషన్ నుంచి నెల రోజుల సమయం ఇస్తే.. ఏం అవుతుందని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు… స్పందన హైలెట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నా అంటున్నారు.. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. వైస్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేల క్యాంప్ మొత్తాన్ని పర్యవేక్షించింది కేసీఆరేననే సంగతిని చంద్రబాబు బయటపెట్టారు. వైస్రాయ్ సిద్ధాంతకర్త ఆయనే కదా.. నడిపించిందే ఆయన.. ఆ విషయాలు ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు . అప్పుడు కేసీఆర్‌ పార్టీలో లేరా? మంత్రిగా చేయలేదా? హరికృష్ణ మృతిపై నేను ఏం రాజకీయం చేశాను? ఫోన్ చేసి.. ఆ తర్వాత కార్యక్రమాలు చూడాలని కోరాను. తప్పేంటి? అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2009లో పొత్తులో సీట్లు ఇవ్వనంటే పరిగెడుతూ వచ్చి .. ఎన్ని సీట్లు ఇస్తామంటే.. అన్ని తీసుకున్నారని గుర్తు చేశారు. మోడీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటే తమకేమీ నష్టం లేదని..అయితే.. ముసుగులో గుద్దులాట ఎందుకు..అందరూ కలిసే రావాలని సూచించారు. వైసీపీ, మోదీలతో కలిసి పోటీ చేయండి. ఎవరు వద్దన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. నమ్మించి మోసం చేశాడనే.. ఎన్డీయే నుంచి బయటకొచ్చామని స్పష్టం చేశారు.

తను హైదరాబాద్ ఐటీకి ఏమీ చేయలేదంటూ.. కేసీఆర్ చెప్పిన విషయాలపైనే సెటైర్లు వేశారు. రాజీవ్ గాంధీ ఐటీని తీసుకొచ్చిన విషయం నిజమే.. మరి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారని చంద్రబాబు ప్రశ్నించాు. కేసీఆర్ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు..నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు…. హైటెక్ సిటీ వచ్చిందని వ్యాఖ్యానించారు. దానికి ఈ కౌంటర్ ఇచ్చారు. తానేమీ చేయకపోతే.. జన్మభూమి గురించి ఊరూరూ పోయి.. భట్రాజులా పొగిడి.. ఇప్పుడేం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి కాకూడదనే మోదీ, కేసీఆర్ లక్ష్యమని.. అందుకే తనను దెబ్బతీయాలని చూసత్ున్నారన్నారు. కేకేసీఆర్ తానా అంటే… జగన్ తందానా అంటున్నారని చంద్రబాబు మండి పడ్డారు. కేసీఆర్ ప్రాజెక్టుల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టానంటున్నారు.. మరి ఎక్కడా ప్రాజెక్టులు కనిపించడం లేదేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన అభివృద్ధి లెక్కలను… వివరించారు. ఏ రంగంలోనూ.. తెలంగాణ ముందుకు పోలేదని.. తిరోగమనంలోనే ఉందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.