బీజేపీపై పోరాడే దమ్ముందా..? టీఆర్ఎస్, వైసీపీ, జనసేనలకు బాబు సవాల్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాల్నే గురి పెట్టినా… తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలనూ టార్గెట్ చేశారు. మోదీకి అనుకూలమో.. వ్యతిరేకమో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, జనసేనలను తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాల్సిన పరిస్థితిని కల్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా… బలమైన కూటమినే సిద్దం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నపార్టీలన్నింటినీ కూడగడుతున్నారు. ప్రాంతీయ పార్టీల్ని ఏక తాటిపైకి తీసుకు వచ్చి… ఫ్రంట్ ప్రకటనకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కూటమి రాజకీయాలను… తెలుగు రాష్ట్రాల్లోనూ.. వ్యూహాత్మకంగా ప్రయోగిస్తున్నారు

దేశంలో ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం అని చెప్పుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్దంగా లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అసలు బీజేపీ పొడే గిట్టవన్నట్లుగా పార్టీలు ఉంటున్నాయి. అన్ని పార్టీలు అంతే. కానీ కొన్నిపార్టీలు మాత్రం .. లోపాయికారీగా స్నేహం కొనసాగిస్తున్నాయి. కేంద్రంతో అవసరాలే కావొచ్చు… దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పితే.. ఆ కష్టాలు ఎందుకన్న … ఆలోచన కావొచ్చు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు బీజేపీకి దూరం అంటున్నాయి కానీ… వాస్తవంగా దగ్గరగా ఉంటున్నాయి. చంద్రబాబు ఈ ప్రతిపక్ష పార్టీలను… చాలా సులువుగా రాజకీయ వ్యూహంలో ఇరికించారు. ఏపీలో… వైసీపీ, జనసేన పార్టీలు… ప్రధాని నరేంద్రమోదీపై… ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు బీజేపీని పల్లెత్తు మాట అనవు. లోపాయికారీ పొత్తులు పెట్టుకున్నారని కూడా చెబుతున్నారు. కానీ బయటకు మాత్రం..మాకు బీజేపీతో సంబంధమేమిటని వాదిస్తున్నారు. వీరి వాదనల్లోని డొల్ల తనాన్ని చంద్రబాబు తెలివిగా బయటపెట్టారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకం అయితే… మోదీని గద్దె దించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం.. టీఆర్ఎస్, వైసీపీ, జనసేనల వల్ల అయ్యే పని కాదు. టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి.. కాంగ్రెస్ కూటమిలోకి రాలేదు. బీజేపీకి వ్యతిరేకమని చెప్పుకోగలదు కానీ… ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమిలో చేరడం సాధ్యం కాదు. టీఆర్ఎస్ తో పోలిస్తే.. వైసీపీకి ఎక్కడ లేని ఇబ్బందులు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకమని కూడా చెప్పుకోలేని దుస్థితి ఆ పార్టీది. నరేంద్రమోదీ పేరు ప్రస్తావించి విమర్శలు చేయం కూడా మానేశారు. కేంద్రం తరపున ఏపీకి అందాల్సిన సాయం ఆగిపోయినా… నిధులు ఇవ్వకపోయినా… నిలదీసి.. అడిగడం కాదు కదా.. కనీసం.. నోటి మాట ద్వారా కూడా కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇక… బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరే సాహసం ఎలా చేస్తారు. ఇక జనసేనది కూడా అదే పరిస్థితి. ఏడాది క్రితం వరకూ… మోదీపై ఘాటు విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు.. గౌరవం ఇవ్వాలని.. టీడీపీ నేతలు సుద్దులు చెబుతున్నారు. అయినా బీజేపీకి అనుకూలమని చెప్పుకునే పరిస్థితి లేదు. ఓ విధంగా చూస్తే.. చంద్రబాబు కూటమి ప్రయత్నాలు.. టీఆర్ఎస్, వైసీపీ, జనసేనలకు ఎటూ తేల్చుకోలేని వ్యవహారమే. చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా వారిని బీజేపీ మద్దతుదారులుగా ప్రజల ముందు ఉంచుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close