వ్యక్తిగత స్వేచ్ఛకు సమాధి..! ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటి..?

ప్రజాస్వామ్య దేశంలో.. పౌరులకు ఉండే ప్రాథమిక హక్కు.. వ్యక్తిగత స్వేచ్చ. దాన్ని వంద శాతం హరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పుడు… ప్రతి ఒక్కరి జీవితం… కంప్యూటర్లు, ఫోన్లతో అనుసంధానమైపోయిది. ఒక్క అడుగు ఎటు నుంచి ఎటు వైపు వేసినా ఫోన్‌లో నమోదయిపోతోంది. ఇక కంప్యూటర్‌లో జీవితానికి సంబంధించిన అన్ని అంశాలూ ఉండిపోతున్నాయి. వీటికి ఇప్పుడు రక్షణ లేదు. అధికారం ఉన్న వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎవరిపైనైనా కోపం వస్తే… అధికార కేంద్రాలు.. వారిని రోడ్డు మీద పడేయడానికి కావాల్సినట్లు..ఈ ఫోన్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని వాడుకోబోతోంది. ప్రజలందరికీ దడ పుట్టించే ఈ నిర్ణయాన్ని ఉలుకూ..పలుకూ లేకుండా కేంద్రం తీసుకుంది.

ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణం అవుతోంది. మోదీ అభద్రతాభావంతో ఉన్న ఓ నియంతగా మారిపోయారని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపింంచారు. అందుకే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడాలని చూస్తున్నారన్నారు. ప్రత్యర్థుల్ని ఏ రకంగానైనా కట్టడి చేయాలని భావిస్తున్నారని.. 10 విచారణ సంస్థలు ఎవరి కంప్యూటర్‌, మొబైల్‌ని అయినా…నియంత్రించగలవంటూ ఇచ్చిన ఆర్డినెన్స్‌తోనే తెలిసిపోతోందన్నారు. కేంద్రం నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విస్మయం వ్యక్తం చేశారు.కంప్యూటర్లు, మొబైల్స్‌లోని డేటాను కేంద్ర నిఘా సంస్థలు…యాక్సిస్‌ చేయొచ్చు అని ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు। ముందస్తు నోటీసులు లేకుండా ఆర్డినెన్స్‌తెచ్చారని ..మోదీ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో వ్యక్తిగత హక్కులకు కూడా…భరోసా లేకుండా పోయిందని మళ్లీ రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆర్డినెన్స్‌ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నిజానికి.. ఇలా అనుమానాస్పద వ్యక్తుల వ్యవహారాలను పరిశీలించడానికి ఇప్పటికీ.. దర్యాప్తు సంస్థలకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే.. అనుమానాస్పద వ్యక్తులు ఎవరంటే.. దానికో విశ్లేషణ ఉంటుంది. కానీ… ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో ఎవరి కంప్యూటర్లను అయినా చూడొచ్చు. ఎవరి ఫోన్లలోకి అయినా చొరబడవచ్చు. అనుమానాస్పదులు కావాల్సినఅవసరం లేదు. మోడీకి కావాలంటే.. చంద్రబాబు కంప్యూటర్, ఫోన్లలోకి చొరబడి.. ఆయన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం విచారణ సంస్థలు క్షణాల్లో ఇచ్చేయగలవు. దీనిపై..అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. వారు బీజేపీలో ఉన్నారు కాబట్టి వారి కంప్యూటర్లను ఎవరూ పరిశీలించరని అనుకుంటున్నారు. కానీ అది తమ వరకే రాదనుకోవడం.. రాజకీయ ప్రత్యర్థుల వద్దకే వెళ్తుందనుకోవడం మూర్ఖత్వం. ఓ రకంగా దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీనే అమలవుతోంది. ఇది రాను రాను మరింత ప్రమాదకరంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close