చిరు కోసం… ఓ కొత్త లోకం!

చిరంజీవి – వ‌శిష్ట కాంబినేష‌న్‌లో ఓ చిత్రం ఇటీవ‌లే క్లాప్ కొట్టుకొంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి `విశ్వంభ‌ర‌` అనే టైటిల్ దాదాపుగా ఖ‌రారుచేశారు. `జ‌గ‌దేక వీరుడు – అతిలోక సుంద‌రి` టైపు సోషియోఫాంట‌సీ క‌థ ఇది. జ‌గ‌దేక వీరుడులో దేవ‌క‌న్య భూమ్మీద‌కు వ‌స్తుంది. అయితే ఇక్క‌డ ఈ ఫార్ములా రివ‌ర్స్ చేశారు. ఓ మ‌నిషే.. దేవ‌లోకంలో అడుగు పెట్ట‌బోతున్నాడు. సాధార‌ణంగా మ‌న పురాణాలు ప‌ద్నాలుగు లోకాలు అని వ‌ల్లిస్తుంటుంది. ఈ సినిమా కోసం ప‌దిహేనో లోకం సృష్టించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ మ‌నుషులు, వాతావ‌ర‌ణం, చెట్లూ, చేమ‌లూ అన్నీ కొత్త‌గా ఉండ‌బోతున్నాయ్ట‌. ఓర‌కంగా చెప్పాలంటే.. అవ‌తార్ లాంటి క‌థ‌న్న‌మాట‌. అవ‌తార్‌లో కూడా అంతే. జేమ్స్ కేమ‌రూన్ ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాడు. ఇక్క‌డ వ‌శిష్ట‌కీ అలాంటి అవ‌కాశం ఉంది. అందుకే గ్రాఫిక్స్ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. మేకింగ్ లో దాదాపుగా స‌గం బ‌డ్జెట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ కే స‌రిపోతున్నాయ్ట‌. ఈ సినిమాలో రానాని ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడిగా ఎంచుకొన్నారు. అయితే అధికారికంగా ప్ర‌క‌టించాల్సివుంది. ఈ సినిమాలో దాదాపుగా అర‌డ‌జ‌ను క‌థానాయిక‌లు ఉండ‌బోతున్నారు. వారి వివ‌రాలూ ఒకొక్క‌టిగా రివీల్ చేయ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close