ష్‌.. ఎవ్వ‌రూ మాట్లాడొద్దు: చిరు అల్టిమేట్టం

తెలుగు చిత్ర‌సీమ‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు చెక్ పెట్ట‌డానికి టాలీవుడ్ పెద్ద‌లంతా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇటీవ‌ల వ‌రుస‌గా అన్న‌పూర్ణ స్టూడియోలో 24 విభాగాల‌కు చెందిన కీల‌క‌మైన వ్య‌క్తుల‌తో స‌మావేశాలు జ‌రిగాయి. ఇవ‌న్నీ చిరంజీవి ఆధ్వ‌ర్యంలోనే కొన‌సాగాయి. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం, కాస్టింగ్‌కౌచ్‌, మీడియా వ్య‌వ‌హారాలు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా లోపాయ‌కారిగా కొన్ని ర‌హ‌స్య భేటీలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎవ‌రైతే ఈ విష‌యంలో ఎక్కువ‌గా ఇన్‌వాల్వ్ అవుతున్నారో, వాళ్లంద‌రికీ చిరంజీవి ఫోన్లు చేసి ‘ఈ విష‌యంపై ఇక ఎవ్వ‌రూ మాట్లాడొద్దు’ అని అల్టిమేట్టం జారీ చేశార్ట‌. టీవీ చ‌ర్చావేదిక‌ల్లో పాల్గొని, చిన్న విష‌యాన్ని పెద్ద‌ది చేయొద్ద‌ని చిరు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. అవ‌స‌రం ఉన్నా, లేకున్నా మీడియా ముందుకు రావ‌డం త‌గ్గించాల‌ని.. ఇదే అంద‌రి దృష్టిలో చుల‌క‌న అవుతుంద‌ని, కొన్ని రోజులు ఈ వ్య‌వ‌హారాల‌పై ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌కుండా ఉంటే.. ప‌రిస్థితులు వాటంత‌ట అవే చ‌క్క‌బ‌డ‌తాయ‌ని చిరు స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. అందుకే గ‌త నాలుగైదు రోజుల నుంచీ ఎవ్వ‌రూ కాస్టింగ్ కౌచ్ గురించి గానీ, శ్రీ‌రెడ్డి గురించి గానీ, మీడియా గురించి గానీ మాట్లాడ‌డం లేదు.

* టీవీ ఛాన‌ళ్ల సంగ‌తేంటి?

కొన్ని వార్త ఛాన‌ళ్ల‌ని బాయ్ కాట్ చేద్దామ‌న్న చ‌ర్చ టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. చిరంజీవి మాత్రం దానికి `నో` చెప్పాడ‌ట. మీడియాని బాయ్ కాట్ చేయ‌డం అసాధ్య‌మ‌ని, దాని వ‌ల్ల తీవ్ర ప‌రిణామాలు సంభ‌విస్తాయ‌ని హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్‌పై మాత్రం కాస్త సీరియ‌స్ నిర్ణ‌య‌మే తీసుకునే అవ‌కాశం ఉంది. ఆడియో ఫంక్ష‌న్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు సంబంధించి వీడియో అవుట్ కొన్ని టీవీ ఛాన‌ళ్లకు అందిస్తుంటారు. ఆ జాబితాలో ఆ వార్తా ఛాన‌ల్ కూడా ఉంది. దాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ని స‌మాచారం. ఈమ‌ధ్య జ‌రిగిన కొన్ని లైవ్ ఈవెంట్ల క‌వ‌రేజీ ఈ ఛాన‌ల్‌కి దక్క‌లేదు. ఈరోజు జ‌ర‌గ‌బోతున్న ‘నా పేరు సూర్య‌’ ఆడియో క‌వ‌రేజీ కూడా ఈ ఛాన‌ల్‌కి ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. మెగా కుటుంబానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు, ఇంట‌ర్వ్యూలూ ఈ ఛాన‌ల్‌కి ఇవ్వ‌కూడ‌ద‌ని చిరంజీవి భావిస్తున్నార్ట‌. ఇది కుటుంబ ప‌రంగా తీసుకున్న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, ప‌రిశ్ర‌మ నిర్ణ‌యానికీ, దీనికీ సంబంధం లేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close