ఉయ్యాల వాడ‌… ఆల‌స్యం ఏంట‌ట‌??

చిరంజీవి 151వ సినిమా కోసం అభిమానుల నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఖ‌రారైనా, ఉయ్యాల వాడ న‌రసింహారెడ్డి స్క్రిప్టు లాక్ అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. దానికి కార‌ణం.. చిరంజీవి లావు త‌గ్గాల‌నుకోవ‌డ‌మే న‌ట‌. తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చినా – ఖైదీ నెం.150లో చెల‌రేగిపోయాడు చిరు. డాన్సుల్లో ఆక‌ట్టుకొన్నాడు. అయితే కొన్ని ఫ్రేముల్లో మ‌రీ బొద్దుగా క‌నిపించాడు. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డిలో మాత్రం ఈ స్థాయిలో క‌నిపిస్తే బాగోదు. అందుకే కనీసం మ‌రో ఆరు కేజీలైనా త‌గ్గాల‌ని టార్గెట్ పెట్టుకొన్నాడ‌ట‌. అందుకోసం చిరు.. ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. బ‌రువు త‌గ్గి, ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌కు త‌గిన‌ట్టు మార‌డానికి చిరుకి కాస్త స‌మ‌యం కావ‌ల్సివ‌చ్చింద‌ట‌. అందుకే ఈ సినిమా ఆగ‌స్టు వ‌ర‌కూ మొద‌ల‌వ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. దానికి తోడు ఈసినిమాకి సంబంధించిన టెక్నిక‌ల్ టీమ్ ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. సంగీతం, కెమెరా, ఫైట్స్ విభాగంలో బాలీవుడ్ సాంకేతిక నిపుణుల స‌హాయం తీసుకోవాల‌ని సురేంద‌ర్ రెడ్డి భావిస్తున్నాడ‌ట‌. వాళ్ల డేట్లు స‌ర్దుబాటు కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని, అందుకే ఆగ‌స్టు వ‌ర‌కూ ఆగాల్సివ‌స్తోంద‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close