తేజ అహం… రాజ‌శేఖ‌ర్ అవుట్‌

ఒక‌వైపు రాజ‌శేఖ‌ర్‌, మ‌రోవైపు తేజ‌.. ఇద్ద‌రికీ ముక్కుమీదే కోపం ఉంటుంది. అందుకే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అహం అనే సినిమా వ‌స్తోందంటే.. చిత్ర‌సీమ సైతం షాక్ తింది. ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అవ్వుద్దా?? అని సందేహించింది. ఆ అనుమాన‌మే ఇప్పుడు నిజం అవ్వ‌బోతోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. అహం సినిమా నుంచి రాజ‌శేఖ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని, ఈ సినిమా మొద‌ల్వ‌క‌ముందే.. ఆగిపోయింద‌ని టాలీవుడ్ టాక్‌. రాజ‌శేఖ‌ర్ ప్ర‌తినాయ‌కుడిగా ఈ సినిమాతో స‌రికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాల్సివుంది. తేజ కూడా స్ర్కిప్టు సిద్ధం చేసుకొన్నాడు. అయితే.. షూటింగ్ ఇంకొద్ది రోజుల్లో మొద‌ల‌వుతుంద‌న‌గా… తేజ‌, రాజ‌శేఖ‌ర్ ల‌మ‌ద్య విబేధాలొచ్చాయ‌ని టాక్‌. దాంతో.. రాజ‌శేఖ‌ర్ త‌న‌కు తానుగా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడ‌ని చెప్పుకొంటున్నారు.

అటు తేజ‌కీ, ఇటు రాజ‌శేఖ‌ర్‌కి ఓ విజ‌యం అవ‌స‌రం. ఇద్ద‌రూ నిరూపించుకొనే ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు. దాంతో ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే.. జ‌నాల్లో ఆస‌క్తి పెరిగేది. అయితే.. ఇద్ద‌రూ మాటా మాటా అనుకొని.. ఈ సినిమాని వ‌దులుకోవ‌డం నిరాశ క‌లిగించే విష‌య‌మే. ఇద్ద‌రిలో ఎవ‌రు త‌మ `అహం` పక్క‌న పెట్టినా… ఈ `అహం` ఎప్పుడో ప‌ట్టాలెక్కేద్దును. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు.. ఇద్ద‌రిలో ఒక‌రు కామ్ అయినా.. షూటింగ్ మొద‌లైపోతుంది. మ‌రి ఆ ఒక్క‌రూ ఎవ‌రన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close