కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్..! ప్రలోభాల ఆరోపణలు షురూ…!

ఎన్నికల ఫలితాలు రాక ముందే.. తెలంగాణలో బేరసారాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. తనను కాంగ్రెస్ లోకి రమ్మని… ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆహ్వానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మర్రి జనార్ధన్ రెడ్డి ఆరోపణలతో.. టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ పై.. తీవ్రమైన విమర్శలతో దాడి ప్రారంభించారు. మర్రి జనార్ధన్ రెడ్డి తనకు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వద్ద నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ నెంబర్ ను మీడియాకు చూపించారు. ఎమ్మెల్యేలు తక్కువ అయితే.. మద్దతివ్వాలని కోరారని..జానారెడ్డి ఇంటికి వస్తే మాట్లాడుకుందామని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. కానీ తను తిరస్కరించానని .. నిప్పు లాంటి వాళ్లమని.. ఇంకెప్పుడూ కాల్ చేయవద్దని చెప్పానన్నారు. టీఆర్ఎస్ కు చెందిన మీడియా చానల్ “టీ న్యూస్ ” ఉదయం నుంచి ఇదొక్కదాని మీదే న్యూస్ రన్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలతో పాటు.. చంద్రబాబుపైనా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

దీంతో సాయంత్రానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను అనేక మంది టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ ఉంటానని..ఫోన్ చేసినంత మాత్రాన ప్రలోభ పెట్టినట్లా అని ప్రశ్నించారు. తాను మాత్రమే మర్రి జనార్ధన్ రెడ్డికి ఫోన్ చేయలేదని..ఆయన కూడా అనేక సార్లు తనకు చేశారని… వాట్సాప్ కాల్ రికార్డ్స్ ను.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బయటపెట్టారు. 9000444777, 9030899999 ఈ నెంబర్స్‌ నుంచి మర్రి జనార్ధన్ రెడ్డి వాట్సాప్‌ కాల్స్‌ చేశారని బయటపెట్టారు. టీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లన్నీ ట్యాపింగ్‌లో ఉన్నాయని.. అందుకే వారంతా టెన్షన్ పడుతున్నారని విమర్శించారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదని మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నాకు మర్రి జనార్థన్‌రెడ్డి ఒక్కడితోనే కాదు…50 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో మంచి సంబంధాలున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌లో కొందరు మంచివాళ్లు కూడా ఉన్నారన్నారు విశ్వేశ్వర్‌రెడ్డి.

ఎన్నికల ఫలితాలు రాక ముందే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య.. ప్రలోభాల ఆరోపణలు వెల్లువెత్తడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది. రేపు పొరపాటున తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తే.. ఇక ఇలాంటి ఆరోపణలకు హద్దే ఉండదన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close