కాంగ్రెస్ లో ఆ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్!

ఈ మ‌ధ్య రాహుల్ గాంధీ బాగా జ‌రుగుతున్న చ‌ర్చ‌… యువ‌రాజుకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని! సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సీనియ‌ర్ నాయ‌కులు సైతం రాహుల్‌కి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అధినేత్రి సోనియా గాంధీపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఇంకో వ‌ర్గం… రాహుల్‌కి బాస‌ట‌గా నిలిచేందుకు సోద‌రి ప్రియాంక‌ను కూడా పార్టీలోకి రావాల్సిందిగా కోరుతున్నారు. ప్రియాంక ప్ర‌చారంలోకి దిగితే కాంగ్రెస్‌కు పెద్ద ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌ని అంటున్నారు. అంటే, రాహుల్ గాంధీ క‌రిజ్మా పార్టీకి స‌రిపోవ‌డం లేద‌న్న‌ది అంత‌ర్లీనంగా వ్య‌క్త‌మౌతున్న అభిప్రాయం. ఆ విష‌యాన్ని నేరుగా చెప్పే ధైర్యం నాయ‌కుల‌కు ఉంటుందా..? అందుకే, ప్రియాంకా కూడా రావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఏతావాతా కొంత‌మంది నాయ‌కుల్లో రాహుల్ లీడ‌ర్‌షిప్ మీద న‌మ్మ‌కం లేద‌నే చెప్పాలి. పార్టీ ప‌గ్గాలు యువ‌రాజుకు ఇచ్చేయాల‌ని డిమాండ్ వినిపిస్తున్నా… ఆఫ్ ద‌రికార్డులో రాహుల్ నాయ‌క‌త్వంపై కొంత‌మందికి న‌మ్మ‌కం లేదు. ఈ ముసుగులో గుద్దులాట‌ను బ్రేక్ చేస్తూ.. అధినేత్రికి కొంత‌మంది మెసేజ్‌లు పెడుతున్న వ్య‌వ‌హారం ఇప్పుడు కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

తాజాగా అలాంటి వ్య‌వ‌హార‌మే వెలుగులోకి వ‌చ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయ‌కుడు శైలేష్ చౌబే, రాహుల్ గాంధీ గురించి సోనియాకు ఓ వీడియో మెసేజ్ పంపారు. అదే ఇప్పుడు పార్టీలో హాట్ హాట్‌గా మారింది. రాహుల్ గాంధీ రాజ‌కీయాల‌కు స‌రిపోవ‌డం లేద‌ని, అందువ‌ల్ల ఆయ‌న‌కి ఆస‌క్తి ఉన్న‌ ఇత‌ర రంగాల్లో ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంద‌ని శైలేష్ స‌ల‌హా ఇచ్చారు. స‌ర్జిక‌ల్ దాడుల సంద‌ర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు బాధ్య‌తారాహిత్యంతో కూడుకున్న‌విగా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న మాట‌ల ఆమోదయోగ్యంగా ఉండ‌టం లేద‌న్నారు. కాంగ్రెస్‌కి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌నివాళ్లు, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు అస్స‌లు లేనివాళ్లు పార్టీలో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌నే విష‌యాన్ని సోనియా గుర్తించాల‌ని ఆయ‌న కోరారు. రాహుల్ గాంధీ వ‌ల్ల కాంగ్రెస్‌కు ఇంత‌వ‌ర‌కూ లాభం చేకూరిన సంద‌ర్భం ఒక్క‌టైనా లేద‌నీ, న‌ష్ట‌మే ఎక్కువ జ‌రిగింద‌ని అన్నారు. అందువ‌ల్ల ఆయ‌న్ని పార్టీ నుంచి త‌ప్పించి, ఏదైనా వ్యాపారం పెట్టిస్తే రాణిస్తాడేమో చూసుకుంటే బెట‌ర్ అని స‌ల‌హా ఇచ్చారు.

రాహుల్ గురించి శైలేష్ అనూహ్యంగా ఈ వ్యాఖ్య‌లు చేసేస‌రికి… ఇత‌ర కాంగ్రెస్ నాయ‌కులు ముక్కున వేలేసుకుంటున్నారు! కాంగ్రెస్ పార్టీ అంటేనే వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు పుట్టినిల్లు అనే విమ‌ర్శ‌లు చాలానే ఉన్నాయి. ఒక నాయకుడు కొడుకు ఎలాంటి వ్య‌క్తి అయినా, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నా లేక‌పోయినా వాటి గురించి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఫ్యూచ‌ర్ లీడ‌ర్‌గా నెత్తికెత్తేసుకుంటున్న నేతాగ‌ణాన్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాహుల్ గురించి ఏకంగా సోనియాకే మెసేజ్ పెట్ట‌డం అంటే… సాహ‌స‌మే క‌దా! మొత్తానికి ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఎట్ ద సేమ్ టైమ్‌… రాహుల్ నాయ‌క‌త్వ ప‌టిమ గురించి కూడా మ‌రోసారి పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసే అవ‌కాశం ఉంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close