“సిట్” చెల్లదన్న కోర్టు – ” దర్యాప్తు యుద్ధం”లో టీఆర్ఎస్ వాట్ నెక్ట్స్ ?

కేంద్రంపై రాజకీయ యుద్ధంలో మీకూ దర్యాప్తు సంస్థలున్నాయి.. మాకూ ఉన్నాయి.. ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని కేసీఆర్ ప్రారంభించిన యుద్ధంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెలంగాణ బయట వ్యక్తులకు నోటీసులు జారీ చేసి కనీసం పిలిపించలేకపోయిన సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ కు ఇప్పుడు ఉనికి సమస్య ఎదురయింది. ఏసీబీ సెక్షన్ల కింద నమోదు చేసినకేసులను సిట్ దర్యాప్తు చేయకూడదని.. ఏసీబీనే దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. సిట్ వేసిన మెమోను తిరస్కరించింది. దీంతో సిట్ ఉనికి ప్రశ్నార్థకం అయింది.

నిజానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం ఈసీ పరిధిలోకి వస్తుందన్న వాదన ఉంది. గతంలో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకున్నప్పుడు.. ఏసీబీ కేసు నమోదు చేశారు. ఓటుకు నోటు కేసు కాబట్టి ఈసీ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని రేవంత్ కోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పోరాడుతున్నారు. అదే వ్యూహంలో ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనూ నిందితులపై ఏసీబీ కేసు పెట్టారు. అయితే బీజేపీ నేతల టార్గెట్‌ కాబట్టి బలంగా ఉండాలని సిట్ ఏర్పాటు చేశారు. కానీ సిట్ చర్యలు ఎప్పటికప్పుడు తేలిపోతున్నాయి.

ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయడం చెల్లదని ఏసీబీ కోర్టు చెప్పింది. అలాంటప్పుడు.. సిట్ ఇచ్చిన నోటీసులు కూడా చెల్లే చాన్స్ ఉండదు. హైకోర్టు ఇప్పటికే నోటీసులపై స్టే ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం ఇక ముందు నోటీసులు జారీ చేయడం కూడా సాధ్యం కాదు. ఏసీబీ కోర్టు ఇచ్చిన స్టేపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సిట్ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోతుంది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ నింపాదిగానే అయినా టార్గెట్ రీచ్ అయ్యేలా వెళ్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ కేసులో ఓ వైపు సీబీఐ.. మరో వైపు ఈడీ విచారణ చేస్తున్నాయి. వాటి విచారణలో ఎక్కడా తేడా రావడం లేదు. అనుకున్నవారిని అరెస్ట్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close