ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి – కిరణ్ కూ ఓ పదవి !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీజేపీ పెద్దలు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం అనూహ్యమైనదే. కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ యాదవ్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అనూహ్యంగా పురందేశ్వరిని ఖరారు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన ఆమె.. జాతీయ పార్టీలో కొన్ని కీలక పదవుల్ని చేపట్టారు. ఇటీవలి కాలంలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే హఠాత్తుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమించడంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఏం సమీకరణాలు కోరుకుంటుందోనన్న చర్చ ప్రారంభమయింది.

ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవి కేటాయించారు. గతంలో ఈ పదవి కన్నా లక్ష్మినారాయణకు ఉండేది. ఆయన పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. దాంతో ఆ పదవిని ఆయనకు కేటాయించారు. సోము వీర్రాజు పార్టీని పూర్తి స్థాయిలో వైసీపీ తోక పార్టీగా మార్చేశారన్న విమర్శలు ఎదుర్గొన్నారు. కన్నా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి హైప్ వచ్చినా.. వైసీపీ నేతలు చాలెంజ్ చేసి మరీ ఆయనను తప్పించారు. సోము వీర్రాజుకు పోస్టింగ్ ఇప్పించడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్న ప్రచారమూ జరిగింది.

అయితే ఇప్పుడు అనూహ్యంగా మారిన రాజకీయ పరిస్థితులతో.. పురందేశ్వరికి పీఠం అప్పగించడం సంచలనంగా మారింది. ఆమె ఎన్టీఆర్ కుమార్తె కావడంతో.. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ను టార్గెట్ చేశారని కొంత మంది .. లేదు టీడీపీతో పొత్తు కోసం మార్గం సుగమం చేసుకున్నారని మరికొంత మంది వాదిస్తున్నారు. ఏ వ్యూహంతో పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారో తీసుకోబోయే నిర్ణయాలను బట్టి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close