అల్ల‌రోడి సినిమా ఆగిపోయింది

పెద్ద నోట్ల ర‌ద్దు మెల్ల‌మెల్ల‌గా సినిమా రంగంపై ప్ర‌భావాన్ని చూపించ‌డం మొద‌లెట్టింది. ఇప్ప‌టికే కొన్ని సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు మెల్ల‌మెల్ల‌గా సాగుతున్నాయి. షూటింగ్ మొద‌ల‌వ్వాల్సిన చిత్రాలు కొన్ని వెనుక‌డుగు వేస్తున్నాయి. ఈ జాబితాలో అల్లరి న‌రేష్ సినిమా కూడా చేరింది. న‌రేష్ క‌థానాయ‌కుడిగా ‘అలా ఎలా’ తో ఆక‌ట్టుకొన్న‌ అనీష్ కృష్ణ ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్ ఇది. డిసెంబ‌రు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లవ్వాల్సివుంది. అయితే ఈ సినిమా మేకి వాయిదా ప‌డింద‌ని టాక్‌. నిర్మాత ద‌గ్గ‌ర ప్రొడ‌క్ష‌న్ కి కావ‌ల్సిన `వైట్` లేకపోవ‌డం, త‌న‌యడికి పెళ్లి కుద‌ర‌డంతో.. ఈ సినిమా నిర్మాణం వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకొన్నాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అమ‌లాపాల్‌ని ఎంచుకొన్నారు. అమ‌ల ఫిబ్ర‌వ‌రి దాటిన త‌ర‌వాతే కాల్షీట్లు ఇస్తాన‌ని చెప్పింద‌ట‌. దాంతో ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగాకే చిత్రీక‌ర‌ణ మొద‌లెట్టాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇంట్లో దెయ్యం నాకేం భ‌య్యం సినిమా విడుద‌ల కేవ‌లం ‘నోట్ల ర‌ద్దు’ కార‌ణంతోనే వెన‌క్కి వెళ్లిపోయింది. ఇప్పుడు మ‌రో దెబ్బ‌. పెద్ద నోట్ల ర‌ద్దు అల్ల‌రి న‌రేష్ పై బాగా ఎఫెక్ట్ చూపించింద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close