వీళ్ల రూటే సపరేటు

భారీ బడ్జెట్ సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి, ఓ చిన్న సినిమా ఆస్కార్ కు వెళ్తోందని తెలిసినప్పుడు దేశంలో చాలా మంది ఆశ్చర్యపోయారు. పదుల కోట్లు, వంద కోట్ల రేంజిలో ఖర్చు పెట్టి తీసిన సినిమాలన్నీ ఆ చిన్న సినిమా ముందు బలాదూర్ అయిపోయాయి. అదే, విచారణై అనే తమిళ సినిమా. కేవలం 2 కోట్ల రూపాయలతో నటుడు ధనుష్ నిర్మించిన సినిమా అది. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

కోలీవుడ్, బాలీవుడ్ లలో హీరోలు అభిరుచిగల నిర్మాతలుగానూ సత్తాను చాటుకోవడం కొత్త విషయం కాదు. మంచి టేస్ట్ ఉన్న నటులు ఆలోచింపచేసే సినిమాలు, లేదా వైవిధ్యమైన సినిమాలను తీస్తుంటారు. వాళ్లను రియల్ హీరోస్ అని, స్మార్ట్ హీరోస్ అని అభిమానులు పొగుడుతుంటారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోల్లో ఇలాంటి ట్రెండ్ చాలా తక్కువ.

కోలీవుడ్ లో కమల్ హాసన్ అభిరుచి గల నిర్మాతగా ముందు వరుసలో ఉంటారు. అపూర్వ సహోదరులు సినిమాను నిర్మించడం, ఆయన చేసిన సాహసమే. అందులో మరుగుజ్జులా కనిపించడానికి ఆయన పడ్డ కష్టం కూడా అప్పట్లో సంచలనమే. అప్పటి నుంచి విశ్వరూపం వరకూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ ఇలాంటి హీరోలు ఎవరంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆమిర్ ఖాన్ గురించి. తారే జమీన్ పర్ అనే సినిమాలో నటించడంతో పాటు దర్శక నిర్మాత కూడా ఆయనే. మాస్ మసాలా ఎలిమెంట్స్ లేవు. కనీసం హీరోయిన్ కూడా లేకుండా, ఓ బాలనటుడు ప్రధాన పాత్రధారిగా ఆ సినిమా తీయడం పెద్ద సాహసం. అయితే, ఆర్థికంగా కూడా ఆమిర్ లాభపడ్డారు. రూ. 12 కోట్లతో సినిమా తీస్తే అప్పట్లోనే 90 కోట్లు వసూలు చేసింది. ఆమిర్ ఇంకా అనేక సినిమాలనూ నిర్మించారు.

బాలీవుడ్ లోనే నానా పాటేకర్ వంటి వారు ఆలోచింపచేసే సినిమాలను తీయడం ద్వారా ఖ్యాతి పొందారు. ఆ తర్వాతి హీరోల్లో అక్షయ్ కుమార్ ఓ మైగాడ్ సినిమా నిర్మాతగా మంచి పేరు పొందారు. రూ. 20 కోట్లతో ఆ సినిమా నిర్మిస్తే బాక్సాఫీసు వద్ద బాగానే సందడి చేసింది. 180 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెట్లింది. ఇటీవలే గోపాల గోపాల పేరుతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.

మరో నటుడు జాన్ అబ్రహాం కూడా వెరైటీ సినిమాలను తీస్తున్నారు. రొటీన్ కు భిన్నమైన కథాంశంతో విక్కీ డోనర్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా బడ్జెట్ 9 కోట్లు. కలెక్షన్లు దాదాపు 45 కోట్లు. ఇంకేం కావాలి? పేరుకు పేరు డబ్బుకు డబ్బు. టాలీవుడ్ లో పక్కా మాస్ ఎలిమెంట్స్ తో, 40 నుంచి 50 కోట్ల దాకా ఖర్చుపెట్టి తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడం చూస్తున్నాం. కథను నమ్ముకోవడం, ఆలోచింపచేసే ప్రయత్నం చేయడం అనేవి టాలీవుడ్ లో కనిపించడం అరుదు. సినిమా వ్యాపారమే. అలాగని కోలీవుడ్, బాలీవుడ్ లో గొప్ప సినిమాలుగా పేరు పొందిన చిత్రాలను తీసిన వారు ఆర్థికంగా నష్టపోయారా? లేదు. పెట్టుబడి ఏడెనిమిది రెట్లు కలెక్షన్స్ రాబ్టారు. అదే విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close