కేసీఆర్ జలస్వప్నాన్ని ఆవిష్కరించబోతున్న “డిస్కవరీ”

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంజినీర్‌గా మారి ప్రాజెక్టుల రీడిజైన్ చేసి రూపొందించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ గురించి అంతర్జాతీయ స్థాయిలో మారు మోగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం…శైలి… ఇలా ప్రత్యేకతలన్నింటినీ డిస్కవరీ చానల్‌ ఓ డాక్యుమెంటరీని ప్రపంచ ప్రజల ముందుంచనుంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్‌ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.

కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును నిర్మించాలంటే.. దశాబ్దాలు పడుతుంది. కానీ కేసీఆర్..మూడేళ్లలోనే సాకారం చేశారు. 2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది. 2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్ళ స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది. నీటి లభ్యత ఉన్న సమయంలో రోజుకు రెండు టిఎంసీల చొప్పుున 140టిఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోయనున్నారు. ఇటీవల మూడో టీఎంసీకి కూడా అనుమతి ఇచ్చారు. కాళేశ్వరంలో భాగంగా చిన్నా,పెద్దవి కలిపి 141 టిఎంసీల సామర్థ్యం ఉన్న 19 జలాశయాలను నిర్మిస్తున్నారు. మూడు బ్యారేజీలు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు.దీంట్లో 18 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ కాగా కొత్తగా మరో 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వంద మీటర్ల లోతులో ఉండే గోదావరి నుండి 618 మీటర్ల ఎత్తుకు ఆరు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు.ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు భారీ మోటార్ పంపులను విదేశాల నుండి తెప్పించారు.ఈ ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసేందుకు 4992 మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 203 కిమీ సొరంగ మార్గాలు కూడా తవ్వారు. తెలంగాణ భూభాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగుకు, తాగుకు, పరిశ్రమలకు నీరు కాళేశ్వరం అందిస్తుంది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతున్నది. ఈ విశేషాలన్నింటినీ డిస్కవరీ చూపించనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close