వైసీపీ పడగ నీడ : రిస్క్‌లో ఓటర్ల జాబితా అక్రమార్కుల ఉద్యోగాలు !

గెలవడానికి జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఓటర్ల జాబితాపై పడ్డారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారంతో.., సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఓ ప్రత్యేకమైన టీముల్ని ఏర్పాటు చేసుకుని.. అడ్డగోలుగా ఓటర్లను తీసేస్తున్నారు. ఫామ్ సెవన్ లు పెట్టించి.. పోలీసుల్ని కూడా ఇన్వాల్వ్ చేయించి ఓట్లను తొలగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఈసీ చర్యలు ఏ మాత్రం సంతృరప్తిగా లేవన్న విమర్శలు పెరిగిపోతూండటంతో.. ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.

పర్చూరులో నలుగురు పోలీసు అధికారులపై వేటు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదుపై స్పందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పెద్ద ఎత్తున పిర్యాదులు వెళ్తూండటంతో… రాష్ట్ర ఎన్నికల అధికారికీ స్పందించక తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ 7లు, ఓట్ల తొలగింపులో కుట్ర పూరితంగా వ్యవహిరంచిన వారందరి జాహితాను రెడీ చేయించారు. నిజానికి బీఎల్వోలుగా సచివాలయ ఉద్యోగుల్ని, మహిళా పోలీసుల్ని నియమించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. పేరుకు వారిని ముందు పెట్టి వైసీపీ నేతలు చేయాల్సిన ఘనకార్యాలు చేశారు. వారి దెబ్బకు ఇప్పుడు బీఎల్వోలు బలి అవబోతున్నారు. జోక్యం చేసుకున్న పోలీసుల ఉద్యోగాలు రిస్క్ లో పడబోతున్నాయి.

ఓటర్ల జాబితాలో అక్రమాలను ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కేసులు నమోదైనా, ఆరోపణలు వచ్చినా.. తర్వాత తీవ్రమైన పరిణామాల్ని ఉద్యోగులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికీ ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని వందల మంది ఉద్యోగాలు రిస్క్ లో పడిపోయాయని చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్న తప్పు అయినా కాపాడలేకపోతున్నారు. ప్రభుత్వం మారితే అందరికీ డిస్మిస్ ఆర్డర్స్ చేతికి వస్తాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించే.. టీడీపీ పూర్తి స్థాయి అక్రమాలపై ఆధారాలను సేకరించి.. వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల...

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close