ఎన్టీఆర్ ‘అరవింద సమేత..’లో తెలుగమ్మాయ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత’. వీరరాఘవ… అనేది కాప్షన్. ఈ సినిమాలో ‘దువ్వాడ జగన్నాథమ్’ ఫేమ్ పూజా హెగ్డే హీరోయిన్. ఆమెతో పాటు కథలో మరో కథానాయికకు చోటుందని తెలుస్తోంది. ఆ పాత్రకు తెలుగమ్మాయ్ ఈషా రెబ్బాను ఎంపిక చేశారు. ‘అమీ తుమీ’లో ఈషా నటన దర్శకుడు త్రివిక్రమ్‌కి నచ్చిందట. అందులో ఆమె పాత్ర చూసే ‘అరవింద సమేత’లో అవకాశం ఇచ్చార్ట‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు నుంచి ఈషా షూటింగులో జాయిన్ అవుతున్నారు. ఆమె పాత్ర ఎలా వుంటుందో మరి! రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నాగబాబు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close