ఆరోగ్య‌శ్రీ నిధుల‌కి ఎన్నిక‌ల కోడ్ ఎందుకు అడ్డ‌మౌతుంది..?

తెలంగాణ‌లో ఆరోగ్య‌శ్రీ కింద వైద్య‌సేవ‌లు నిలిపేస్తామంటూ ప్రైవేటు ఆసుప‌త్రులు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌కు బాకీ ప‌డ్డ సొమ్మును చెల్లించాలంటూ ఆసుప‌త్రుల సంఘం గ‌డువు పెట్టినా, దాన్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని వారు అంటున్నారు. అయితే, చివ‌రి నిమిషంలో రంగంలోకి దిగారు మంత్రి ఈటెల రాజేంద‌ర్. రూ. 1500 కోట్ల బ‌కాయిల్ని చెల్లించాల‌ని హాస్పిట‌ల్ యాజ‌మాన్యాలు అంటుంటే, కాదు కాదు బ‌కాయిప‌డ్డ‌ది రూ. 450 కోట్లు మాత్ర‌మే అని మంత్రి ఈటెల మీడియాకి చెప్పారు. అయితే, వాటిని కూడా ఒకేసారి చెల్లించ‌లేమ‌నీ, ద‌శ‌ల‌వారీగా నిధులు విడుద‌ల చేస్తామ‌ని మంత్రి అన్నారు. బ‌కాయిల పేరుతో చికిత్స‌లు, అత్య‌వ‌స‌ర సేవ‌ల్ని వైద్యులు నిలిపేయ‌డం స‌రికాద‌న్నారు.

అదేంటీ.. తెలంగాణ ధ‌నిక రాష్ట్రం క‌దా! ఈటెల లెక్క‌ల ప్ర‌కార‌మే రూ. 450 కోట్ల‌ను స‌ర్దుబాటు చెయ్య‌లేక‌పోయారా..? ఆరోగ్య శ్రీ లాంటి ప‌థ‌కానికి కూడా బ‌డ్జెట్ లో కేటాయింపులు చెయ్య‌లేక‌పోయారా..? అయినా, ఎన్నోయేళ్లుగా అమ‌లౌతున్న ప‌థ‌కానికి నిధుల విడుద‌ల అనేది సాధార‌ణ ప‌రిపాల‌న వ్య‌వ‌హారంగా మారిపోవాలి క‌దా…? ఇంత‌కీ నిధులు ఎందుకు విడుద‌ల చేయ‌లేకపోయార‌న్న‌దానికి కూడా మంత్రి ఈటెల మ‌రో కార‌ణం చెప్పారు! అదేంటంటే… ఎన్నిక‌ల కోడ్ వ‌ల్ల నిధుల కేటాయింపులు ఆల‌స్యమైంద‌న్నారు. రాష్ట్రంలో వ‌రుస ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంటూ వ‌చ్చింద‌నీ, అందుకే ప్ర‌భుత్వం బ‌డ్జెట్ కేటాయించ‌లేక‌పోయింద‌న్నారు. నిజానికి, ఆరోగ్య‌శ్రీ నిధుల‌కీ ఎన్నిక‌ల కోడ్ కి సంబంధం ఉంటుందా… క‌చ్చితంగా ఉండ‌ద‌నే చెప్పాలి.

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కొత్త‌దేం కాదు, ఉమ్మ‌డి రాష్ట్రం ఉండ‌గానే వైయ‌స్సార్ హ‌యాంలో ప్రారంభ‌మై కొన‌సాగుతూ ఉంది. గ‌త ప్ర‌భుత్వాల నుంచి అమ్మ‌ల్లో ఉన్న ఇలాంటి సంక్షేమ ప‌థ‌కాల నిధుల విష‌య‌మై ఎన్నిక‌ల సంఘం ఎలాంటి అభ్యంత‌రాలూ వ్య‌క్తం చెయ్య‌దు. ఇక‌, బ‌డ్జెట్ విష‌యానికొస్తే… ఈ ప‌థ‌కానికి ఎప్ప‌టిక‌ప్పుడు నిధుల‌ను కేటాయించుకునే క‌దా ఇన్నాళ్లూ అమ‌లు చేసింది! ఆ లెక్క‌న ఇప్పుడు కూడా ఆరోగ్య‌శ్రీ‌కి నిధుల విడుద‌ల స‌క్ర‌మంగానే ఉండాలి. అలా విడుద‌ల చేయ‌క‌పోవ‌డం తెరాస స‌ర్కారు అల‌స‌త్వం. అంతేకాదు, సేవ‌లు నిలిపేస్తామ‌ని ఆసుప‌త్రుల యాజ‌మాన్యాలు ప్ర‌క‌టించే చివ‌రి నిమిషం వ‌ర‌కూ ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం కూడా బాధ్య‌తా రాహిత్యంగానే క‌న‌బ‌డుతోంది. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌నీ, నిధులు విడుద‌ల ఆల‌స్య‌మైంద‌నేది మంత్రి ఈటెల చెప్ప‌డం త‌ప్పుని వేరేవాళ్ల‌పై నెట్టేయ‌డం అన్న‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయం క‌లుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close