ఎన్నికల కమిషన్‌పైనా చెరపలేని మచ్చ…! ఆ మాజీ అధికారులు చెప్పింది నిజమే..!?

ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ.. ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నిర్వహించాలి. కానీ ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోంది. ప్రతిపక్షాలపై ముప్పేట దాడి జరుగుతూ.. అధికారం పక్షం అయిన బీజేపీకి తొత్తులా.. ఈసీ వ్యవహరిస్తోంది. ఇదే విషయాన్ని చెబుతూ… ఆధారాలతో సహా… అరవై ఆరు మంది అధికారులు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈసీ తీరుపై పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ సీఎస్‌ను హఠాత్తుగా మార్చిన తీరుపైనా విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు ఈసీ ఏకపక్షంగానూ, మోదీ ఎలక్షన్ కమిషన్ కమిషన్‌గానూ పనిచేస్తోందని మండిపడ్డారు.

ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శివశంకర్ మీనన్ సహా 66 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ కు ఎనిమిది పేజీల లేఖ రాశారు. రాజ్యాంగ సంస్థగా నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని, కేంద్రంలోని అధికార పార్టీకి కొమ్ము కాస్తోందన్న అనుమానం కలుగుతోందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఒక రూల్, విపక్షాలకు ఒక రూల్ అన్నట్లుగా ఈసీ తీరు ఉందని విశ్లేషిస్తూ.. టీవీలో మాట్లాడటం ద్వారా ఎన్నికల వేళ మోదీకి అనుకున్న పబ్లిసిటీ వచ్చిందన్నారు. మోదీ ప్రసంగాలను మాత్రమే ప్రసారం చేసే నమో టీవీ ఏర్పాటు కూడా ఆమోద యోగ్యం కాదన్నారు. ఏదేమైనా రాష్ట్రపతి కోవింద్ జోక్యం చేసుకుని రాజ్యాంగ సంస్థల నిబద్ధతను కాపాడాలని 66 మంది మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ఎన్నికల సంఘం తన స్వేచ్ఛను కాపాడుకుంటూ సమర్థంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేయాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని బదిలీ చేసిన తీరుపై మాజీ బ్యూరోక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ డీజీ విషయంలో తమ ఆదేశాలను ఖాతరు చేయకుండా జీవో జారీ చేశారని కన్నెర్ర చేసిన ఈసీ ఏకంగా చీఫ్ సెక్రటరీపైనే వేటు వేసింది. రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చినా సంతృప్తి చెందని ఈసీ వెంటనే చీఫ్ సెక్రటరీని సాగనంపింది. ఏపీ చీఫ్ సెక్రటరీతో పాటు పశ్చిమ బెంగాల్లో నలుగురు పోలీసు ఉన్నతాధికారులను హుటాహుటిన బదిలీ చేసిన ఎన్నికల సంఘం, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న తమిళనాడు డీజీపీ విషయంలో మాత్రం మౌనం వహించిందని వారు గుర్తు చేశారు. పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత కూడా కొనసాగుతున్న అధికారికి ఎన్నికల విధులు అప్పగించకూడదని నియమం ఉన్నప్పటికీ తమిళనాడు విషయంలో మాత్రం ఈసీ పచ్చజెండా ఊపిందని వారు గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నా .. చూసీ చూడనట్లు ఉండటం ఏమిటని అధికారులు ప్రశ్నించారు.

రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ నేరుగా బీజేపీకి ప్రచారం నిర్వహించినట్లు మాట్లాడినా ఇంతవరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ప్రస్తావించారు. సైనిక దళాలను మోదీ సైన్యం అంటుూ సంబోధించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై కోడ్ ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. అటు కల్యాణ్, ఇటు యోగీ ఇద్దరు అధికార పార్టీ వారేనని గుర్తించాలన్నారు. దీని వల్ల ప్రజలను తప్పుతోవ పట్టించినట్లవుతుందని వారు అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఎన్నికల ముందు మోదీ టీవీలో మాట్లాడుతూ క్షిపణితో ఉపగ్రహాన్ని కూల్చేసినట్లు ప్రకటించినా దాన్ని కోడ్ ఉల్లంఘన కింద పరిగణించకపోవడం ప్రశ్నార్థకమవుతుందన్నారు. క్షిపణి ప్రయోగానికి సంబంధించి మోదీ ప్రసంగం ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని తేటతెల్లమైనప్పటికీ విపక్షాల ఫిర్యాదును ఈసీ తోసిపుచ్చిన తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి చర్యలతో ఎన్నికల కమిషన్‌ నిబద్ధత ప్రశ్నార్థకం అవుతోందని ఆ అధికారులు ఆరోపించారు. నిజానికి ఆ అధికారులు లేఖలో చెప్పారు. కానీ ప్రజల్లో ఉన్న సందేహాలు ఇవే. దేశంలో వ్యవస్థలన్నీ ఇప్పటికే దిగజారిపోయాయి. ఇక ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియనుకూడా.. దుర్వినియోగం చేస్తే.. ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close