సొంత పార్టీ వారికి చెక్ పెడుతున్న మంత్రి ఈటెల‌!

మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఈ మ‌ధ్య కాస్త అస‌హ‌నంతో ర‌గిలిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అసంతృప్తి అంతా సొంత పార్టీ వారిమీదే. కార‌ణం ఏంటంటే… గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌వారే చివ‌రి నిమిషంలో వెన్నుపోటు పొ‌డిచార‌నీ, అయినాస‌రే ప్ర‌జ‌ల అధ‌ర్మంవైపు వెళ్ల‌లేద‌నీ, త‌న‌ను గెలిపించార‌ని మంత్రి త‌ర‌చూ చెబుతున్నారు. అయితే, త‌న‌ని వెన్నుపోటు పొడిచినవారి గురించి ఇన్నాళ్లూ మాట్లాడుతూ వ‌చ్చిన మంత్రి ఈటెల‌, ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటున్నార‌ట‌! మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ‌చ్చాయి క‌దా… ఇప్పుడు నా స‌త్తా చూడండి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట! 

ఇదే మాట‌ల‌ను త‌న నియోజ‌క వ‌ర్గం హుజూరాబాద్ లో కార్య‌క‌ర్త‌లూ నాయ‌కుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఓపెన్ గా చెప్పేశారు. ఇంత ఓపెన్ గా మిమ్మ‌ల్నే న‌మ్మి, మీ కోస‌మే అన్నీ చేసి, ఇంత చేసినా కూడా తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే తీరులో ఉన్నార‌నుకొండి, అప్పుడు మ‌న‌సుకు బాగా గాయ‌మైత‌ది అన్నారు. ధ‌ర్మంగా ఉండ‌టం, న్యాయంగా ఉండ‌టం, స‌త్తా క‌లిగి ఉండ‌టం ఇలాంటివి బ‌య‌ట‌కి క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌న్నారు. చివ‌రికి వాటికే విజ‌యం ద‌క్కుతుంద‌న్నారు. మ‌సిపూసి మారేడు చేసే ప‌ద్ధ‌తిలో ఉన్న‌వారు తాత్కాలికంగా విజ‌యం సాధిస్తారు త‌ప్ప‌, అది శాశ్వ‌తం కాద‌ని కొంత‌మంది గుర్తుంచుకోవాల‌న్నారు. ఇక‌పై ఎవ్వ‌ర్నీ గుడ్డిగా న‌మ్మ‌లేన‌ని మంత్రి ఈటెల అన్నారు. ప‌ద‌వుల కోసం త‌న చుట్టూ తిర‌గ‌డం, వ‌చ్చాక త‌న‌కే త‌ల‌నొప్పిగా కొంత‌మంది తయార‌య్యార‌ని ఆయ‌న త‌న వ‌ర్గంతో అసంతృప్తి వ్యక్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఏడాది కాలంగా దాచుకుంటూ వ‌స్తున్న అసంతృప్తిని మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బ‌య‌ట‌పెట్టేస్తున్నారు ఈటెల‌. సీట్లు కావాలంటూ త‌న ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్న‌వారిలో కొంద‌రికి నిర్మొహ‌మాటంగా ఇవ్వ‌ను అని చెప్పేస్తున్నార‌ట‌.

ఈయ‌న‌తోపాటు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు నాయ‌కులు ఇదే త‌ర‌హాలో త‌మ‌కి వెన్నుపోటు పొడిచారనుకునే నాయ‌కుల‌కు చెక్ పెట్టేస్తున్నారని స‌మాచారం. త‌న‌కు వెన్నుపోటు పొడిచినా భ‌రించాన‌నీ, కానీ పార్టీకి వెన్నుపోటు పొడిచేవారిని క్ష‌మించ‌లేనంటూ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో గంగుల క‌మ‌లాక‌ర్ చెప్పేవారు. కొప్పుల ఈశ్వ‌ర్ కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో ఈజీగా గెలుస్తారూ అనుకుంటే, చివ‌రి నిమిషంలో కొంత‌మంది దెబ్బ తీశార‌నీ, దీంతో అతి క‌ష్ట‌మ్మీద గ‌ట్టెక్కాల్సి వ‌చ్చింద‌న్న‌ది ఆయ‌న ఆవేద‌న‌. మొత్తానికి, మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సొంత‌వారిపైనే ప్ర‌తీకారం తీర్చుకునే ప‌నిలోప‌డ్డారు తెరాస కీల‌క నేత‌లు.  ఈ ప్ర‌తీకార చ‌ర్య‌ల్ని సీఎం కేసీఆర్ ఎలా తీసుకుంటారో చూడాలి? ఎన్ని అసంతృప్తులున్నా అంద‌రూ క‌లిసి ప‌నిచేయాలంటూ ఆయ‌న ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close