కరోనాకు రోజూ ఐదారుగురు జర్నలిస్టులు బలి..!

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఫోన్లలో అయినా వాట్సాప్ కాంటాక్ట్ లిస్టులు చూడండి.. ఖచ్చితంగా..ప్రతీ రోజూ..రెండో..మూడో రిప్ సందేశాలతో ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయండి… మిత్రుడ్ని కరోనా మింగేసిందనే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో అయితే.. ఇలాంటి ఆవేదనలకు కొదవే లేదు. ముఖ్యంగా జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్న వారు మరీ ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు. ప్రతీ రోజూ.. నలుగురు, ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. స్ట్రింగర్ల దగ్గర్నుంచి ఎడిటర్ స్థానంలో ఉన్న వారు వరకూ.. ఇలా కరోనాకు బలి అయిపోతున్నారు.

రెండు రోజుల కిందట.. ఆంధ్రజ్యోతిలో సీనియర్ ఎడిటర్‌గా భళ్లమూడి రామకృష్ణ అనే జర్నిలిస్టు… నిన్న వీ6లో ఓ సీనియర్ సబ్ ఎడిటర్… ఈ రోజు సాక్షి టీవీలో పని చేసే.. మదనపల్లి గోపి.. ఇలా వరుసగా మరణవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏ న్యూస్ పేపర్ చూసినా… ఇతర పత్రికల్లో పని చేసే జర్నలిస్టులు చనిపోయిన వార్తలు కాకపోయినా.. తమ ప త్రికలో పని చేసే జర్నలిస్టుల మరణవార్తలు.. ఆయా పత్రికలు ప్రచురిస్తున్నాయి. స్ట్రింగర్ల దగ్గర్నుంచి స్టాఫర్ల వరకూ.. చివరికి ఫీల్డ్ వర్క్‌తో పని లేకుండా.. డెస్కుల్లో పని చేసే వారు కూడా బలైపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత మూడు రోజుల్లోనే పదిహేను మంది సీనియర్ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

కానీ ఆ తర్వాత ఇంకా ఎక్కువ మందే చనిపోయారు. అనారోగ్యానికి గురైన జర్నలిస్టులకు కనీసం ఆస్పత్రుల్లో బెడ్ దొరకడం లేదు. రిపోర్టర్లు.. తమ పలుకుబడి అంతా ఉపయోగించినా.. పై స్థాయి వారికి మాత్రం కొన్ని బెడ్లు దొరుకుతున్నాయి. కానీ నాసిరకం ట్రీట్‌మెంట్ … జర్నలిస్టుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయకపోవడం వంటి కారణఆలతో ఎక్కడగా ప్రాణాలు కోల్పోతున్నారు. జర్నలిస్టుల పని వాతావరణం… ఫీల్డ్ లో ఉండే సమస్యలు… వేళాపాళా లేని పని గంటల వల్ల.. సహజంగానే జర్నలిస్టులకు ఇతర ఆరోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. వాటి వల్ల కరోనా మరింత తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.

సమాజం కోసం.. ఎంతో శ్రమించి… వారి బాగోగుల్ని ప్రభుత్వం చూసేలా వార్తలు రాస్తున్న జర్నలిస్టులకు ఇప్పుడు గ్యారంటీలేకపోయింది. వారి కోసం వారు రాసుకోలేకపోతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తిస్తామని కేంద్రం చెప్పింది..అదిఎలానో .. దాని వల్ల కనీసం చికిత్స అయినా ఉచితంగా అందిస్తారా.. అన్నదానిపై ఎవరికీ వివరాల్లేవు. మొత్తంగాకరోనా కాటు ఇప్పుడు జర్నలిస్టులపైనే ఎక్కువగా ఉంది. వారు తమని తాము కాపాడుకోడమే ప్రాధాన్యంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close