అఫీషియ‌ల్ : ‘పుష్ష’ విల‌న్‌గా ఫ‌హ‌ద్ ఫాజిల్

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష‌`. ఈ సినిమా మొద‌లై చాలా కాలమైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ విల‌న్ ఎవ‌రన్న‌ది ఫిక్స్ కాలేదు. విజ‌య్ సేతుప‌తి నుంచి – సునీల్ వ‌ర‌కూ విల‌న్ గాచాలామంది పేర్లు వినిపించాయి. బాబి సింహా, ఆర్య‌… ఇలా చాలా మంది ని ప‌రిశీలించారు. ఇప్పుడు.. ఎట్ట‌కేల‌కు చిత్ర‌బృందం విల‌న్ ని వెదికి ప‌ట్టుకోగ‌లిగింది. త‌నే.. ఫ‌హ‌ద్ ఫాజిల్.

మ‌ల‌యాళంలో విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా ఫాజిల్ కి మంచి గుర్తింపు ఉంది. తాను న‌టించిన కొన్ని చిత్రాలు.. ఆహాలో డ‌బ్బింగ్ రూపంలో వ‌చ్చాయి. అవి చూసి.. ఫాజిల్ కి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. త‌ను జాతీయ అవార్డు విన్న‌ర్ కూడా. ఇప్పుడు త‌న‌నే.. ఈ సినిమాలో విల‌న్ గా ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్‌కి మ‌ల‌యాళంలో భారీ ఎత్తున అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళం నుంచి విల‌న్ ని తీసుకొస్తే… అక్క‌డ ఈ సినిమాకి మ‌రింత బిజినెస్ పెరుగుతుంది. ఆ లెక్క‌లు కూడా ఫాజిల్ ని ఎంచుకోవ‌డానికి ఓ కార‌ణం కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close