మంత్లీ రివ్యూ: ఫిబ్ర‌వ‌రి… అదే స్టోరీ!!

టాలీవుడ్‌కి ఏదో అయ్యింది. వ‌రుస ప‌రాజ‌యాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఫ్లాపుల మాట అటుంచితే… చిత్ర‌బృందం ప‌రువులు పోయే ఫ‌లితాల్ని మూట‌గ‌ట్టుకోవ‌డం మ‌రింత విషాదాన్ని మిగులుస్తోంది. జ‌న‌వ‌రిలో పెద్ద సినిమాలు హ‌డావుడి చేసినా `ఎఫ్ 2` రూపంలో ఒకే ఒక్క విజ‌యాన్ని ద‌క్కించుకుని `బ‌తుకుజీవుడా` అంటూ గ‌ట్టెక్కేసింది చిత్ర‌సీమ‌. ఫిబ్ర‌వరిలో మ‌రీ దారుణం. ఆ ఒక్క‌టీ కూడా ల‌భించ‌లేదు. వ‌రుస ఫ్లాపులు షాకిచ్చాయి. సినిమాలు ఇబ్బుడి ముబ్బుడిగా వ‌చ్చినా – ప్ర‌తీవారం రెండు మూడు సినిమాలు హ‌డావుడి చేసినా కాసుల వ‌ర్షం కురిపించిన సినిమా ఒక్క‌టీ లేదు. దాంతో బాక్సాఫీసు క‌ళ త‌ప్పింది. థియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయి.

అటు డ‌బ్బింగ్, ఇటు స్ట్ర‌యిట్ సినిమాలు మొత్తం క‌లిసి ఈ నెల‌లో 18 సినిమాలొచ్చాయి. వాటిలో చెప్పుకోద‌గిన‌వి మ‌హానాయ‌కుడు, దేవ్‌, యాత్ర‌..

క‌థానాయ‌కుడు ఇచ్చిన షాక్‌ని మ‌హానాయ‌కుడు కంటిన్యూ చేసింది. ఈ సినిమా కూడా ఘోర ప‌రాజ‌యాన్ని అందుకుని బాల‌య్య అభిమానుల్ని మ‌రింత నిరుత్సాహానికి గురి చేసింది. తొలి భాగం 20 కోట్లు సాధిస్తే.. రెండో భాగం అందులో పావు వంతు కూడా తెచ్చుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. వై.ఎస్‌.ఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన యాత్రం `ఓకే` అనిపించుకుంది. మ‌హి వి.రాఘ‌వ‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చినా, వ‌సూళ్ల విజ‌యంలో యాత్ర‌కు అన్యాయ‌మే జ‌రిగింది. మ‌మ్ముట్టికి బ‌ల‌మైన మార్కెట్ ఉన్న కేర‌ళ‌లోనూ ఈ చిత్రం పెద్ద‌గా ఆడ‌లేదు. ఇక `దేవ్‌` సంగ‌తి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కార్తి మార్కెట్ నానాటికీ తీసిక‌ట్టుగా త‌యార‌వుతుంద‌ని చెప్ప‌డానికి ఈ సినిమానే ఉదాహ‌ర‌ణ‌. క‌నీసం ఓపెనింగ్స్ కూడా అంద‌లేదు. రివ్యూలూ అంతే దారుణంగా వ‌చ్చాయి.

ఈ నెల‌లో డ‌బ్బింగ్ సినిమాల హ‌వా ఎక్కువ‌గా క‌నిపించింది. అంజ‌లి సీబీఐ, విచార‌ణ‌, ల‌వ‌ర్స్‌డే, సీమ‌రాజా, అమావాస్య‌… ఇలా ఓ ఏడెనిమిది డ‌బ్బింగ్ సినిమాలు వ‌రుస క‌ట్టాయి. అయితే అంద‌రి దృష్టి ల‌వ‌ర్స్ డేపైనే ఉంది. ప్రియా వారియ‌ర్ సినిమా కావ‌డంతో.. ఫోక‌స్ తెచ్చుకుంది. కానీ దారుణ‌మైన క‌థ క‌థ‌నాలు, పేల‌వ‌మైన టేకింగ్‌తో ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. చిత్ర‌బృందం క్లైమాక్స్ మార్చి మ‌ళ్లీ విడుద‌ల చేసినా ప్రేక్ష‌కులు క‌నిక‌రించ‌లేదు. సీమ‌రాజా, అమావాస్య‌లాంటి చిత్రాల సంగ‌తి స‌రే స‌రి. స‌రైన ప‌బ్లిసిటీ లేక‌పోవ‌డం కూడా.. వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపించింది.

మొత్తానికి ఫిబ్ర‌వ‌రిలోనూ తెలుగు చిత్ర‌సీమ‌కు నిరాశే ఎదురైంది. స‌రైన సినిమాలు లేక‌పోవ‌డం, వ‌చ్చిన సినిమాలు ఆడ‌క‌పోవ‌డంతో బ‌య్య‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. కొన్ని చోట్ల థియేట‌ర్లు మూసుకోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. సాధార‌ణంగా ఫిబ్ర‌వ‌రి, మార్చి అంటే బ్యాడ్ సీజ‌న్ అంటుంటారు. ఈసారి… అది మ‌రింత బ్యాడ్‌గా మారిపోయింది. మ‌రి మార్చి అయినా టాలీవుడ్ త‌ల‌రాత‌ను మార్చుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close