గంటా మళ్లీ సీటు మారడం ఖాయమేనా..?

“ఎంపీగా పోటీ చేయాలా..? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది.. హైకమాండ్ నిర్ణయిస్తుంది..” ఇది మంత్రి గంటా శ్రీనివాసరావు మాట. ఆ తర్వాత భీమిలిలో కార్యకర్తల సమావేశం పెట్టి… దమ్ముంటే.. జగన్ భీమిలీలో తనపై పోటీ చేయాలని… సవాల్ చేశారు. రెండూ పరస్పర విరుద్ధమైనవే అయినప్పటికీ.. ఓ సారి పోటీ చేసిన సీటు నుంచి రెండో సారి పోటీ చేయడం అన్నది గంటా హిస్టరీలో లేదు. అందుకే.. ఈ సారి గంటా.,.. భీమిలీలో పోటీలో ఉంటారా.. లేదా అన్నది.. ఆసక్తికరంగా మారింది. దానికి తగ్గట్లుగా… ఆయన ఎంపీగా పోటీ చేయాలా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..అన్నది హైకమాండ్ నిర్ణయం అంటూ… ప్రకటనలు చేస్తున్నారు.

నిజానికి గంటా పేరు.. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెబ్లీ నియోజకవర్గం నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో ఆయన అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొన్నాళ్ల క్రితం.. ఆంధ్రజ్యోతి దినపత్రిక.. ఓ సర్వేను ప్రకటించింది. అందులో గంటా వెనుకబడి ఉన్నారని వెల్లడించారు. ఈ సర్వేపై అప్పట్లో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. హైకమాండ్ పై అలిగారు కూడా. కానీ తర్వాత బుజ్జగించారు. గంటా శ్రీనివాసరావు 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు ఎక్కడా ఓటమిని చవి చూడలేదు. ప్రతిఎన్నికల్లోనూ గెలుస్తునే ఉన్నారు. అయితే ప్రతీసారి కొత్త చోట పోటీ చేస్తున్నారు. 1999 లో అనకాపల్లి ఎంపిగా గెలిచారు. ఆ తర్వాత 2004 లో ఆదే పార్టీ తరుపున చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం తరుపున అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2014 భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం పోటీ చేసి విజయసాధించి, ప్రసుత్తం చంద్రబాబు కేబినేట్ లో మానవవనరుల శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు. ఎంపిగా పోటీచేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎప్పుడు ఓటమిని ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

భీమిలి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సహచరుడు.. అవంతి ప్రస్తుతం ప్రత్యర్థిగా ఉన్నారు. భీమిలీ నియోజకవర్గంలో టిడిపి చాలా బలంగా ఉంది.. కానీ గంటా అనే సరికి కాస్తా తడబాటు ఉందని జోరు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రహించినట్లే కనిపిస్తోంది. అందుకే ఎంపి స్థానానికి పోటీ చేయడానికైనా రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నారు. మొన్నటి వరకు భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టిన గంటా ఇప్పుడు పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు గంటా నోటా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానన్న మాట రాలేదు…కానీ హఠాత్తుగా ఎంపి స్థానం అనే మాట వినబడుతోంది. అందుకే గంటా ఈ సారి సీటు మారొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close