“పీఆర్సీ పెద్దల”తోనే సీపీఎస్ పై చర్చిస్తున్న ప్రభుత్వం !

ఉవ్వెత్తున ఎగసిన పీర్సీ ఉద్యమాన్ని ఏ ప్రయోజనాలు నెరవేరకుండానే ముగించేసిన ఉద్యోగ సంఘ నేతలను ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకు వచ్చింది. బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, ఎపీఎన్జీవో బండి శ్రీనివాసరావు, కే సూర్యనారాయణతో పీఆర్సీ అంశంపై ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. పీఆర్సీ ఉద్యోగులు ఎప్పుడు ఆందోళనలకు పిలుపునిస్తే అప్పుడు చర్చలు పెట్టే ప్రభుత్వం.. సోమవారం కూడా అదే పని చేసింది. ఉద్యోగులు చలో తాడేపల్లికి పిలుపునిస్తే ఉద్యోగ సంఘాల నేతల్ని హడావుడిగా పిలిచి చర్చలు ప్రారంభించింది.

అసలు ఈ ఉద్యోగ సంఘ నేతలకు సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న నేతలకు సంబంధం లేదు. వారు తమ డిమాండ్ కోసం చాలా గట్టిగా పట్టుబటి ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాల్సిందేనంటున్నారు. పీఆర్సీ చర్చల సమయంలో మార్చి 31వ తేదీలోపు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. కానీ ఏప్రిల్ నెలాఖరు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా ఒక్క ఉద్యోగ సంఘం నేత మాట్లాడలేదు. ప్రభుత్వం పిలవగానే తమకు సంబంధం లేకపోయినా చర్చలంటూ వెళ్లిపోయారు.

ప్రభుత్వం వారితోే మాట్లాడి.. సీపీఎస్ రద్దు ఉద్యోగ సంఘాలే వద్దన్నాయని ప్రత్యామ్నాయంగా కొంత మేలు చేస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ కొత్త కమిటీని నియమించింది. సీఎస్ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది. ఇప్పటికి సీపీఎస్‌పై ఎన్ని కమిటీలు వేశారో స్పష్టత లేదు. మళ్లీ కొత్త కమిటీ నియమించారు. అసలు సీపీఎస్ ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close