చైనా పెట్టుబడులనూ సరిహద్దుల్లోనే ఆపేసిన భారత్..!

సంక్షోభంలో కూరుకుపోయిన భారత కార్పొరేట్ కంపెనీలను చైనా చేజిక్కించుకునే కుట్ర చేస్తోందని…కేంద్రం మేలుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మూడు రోజుల కిందట ఆందోళన వ్యక్తం చేశారు. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు.. సీక్రెట్‌గా… కార్పొరేట్ సంస్థల్లో వాటాలు పెంచుకుటూండటంతో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం కూడా.. ఈ అంశాన్ని గమనించింది. వెంటనే… విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో భారత కంపెనీను హస్తగతం చేసుకోవాలన్న చైనా ప్రయత్నాలకు కేంద్రం అడ్డుకట్ట వేసేసింది.

భారత్‌తో సరిహద్దులు కలిగిన దేశాలు …ఇక్కడి కంపెనీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పక తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనలు మార్చింది. ప్రస్తుతం కంపెనీలకు కష్టకాలం వచ్చింది. లాక్ డౌన్ వల్ల కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. అలాంటి కంపెనీల మీద విదేశీ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఆయా సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసి.. భారత్‌లోని కంపెనీల్లో తమ వాటాను పెంచుకునేందుకు, లేదా ఏకమొత్తంగా కైవసం చేసుకునేందుకు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నాయి. చైనా ఇదే వ్యూహంతో ఉన్నట్లు కేంద్రానికి ఖచ్చితమైన సమాచారం అందింది. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు భారత కంపెనీల ఓనర్ షిప్‌ను మార్పు చేసే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు.

గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విషయంలో ఈ తరహా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా చైనాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లోని ఆర్థిక కష్టాల్లో ఉన్న కంపెనీల నుంచి వాటాలు కొనుగోలు చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ రకమైన ఆర్థిక ఎమర్జెన్సీ కనిపిస్తోంది. భారీ మాంద్యం కళ్ల ముందు ఉందని.. ఐఎంఎఫ్ లాంటిసంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఆర్థిక పునాదులు బలంగా ఉన్న భారత కార్పొరేట్ సంస్థలకు ఇది ఆందోళనకరమైన అంశమే. అవి చేతులు మారితే.. భారత ఆర్థిక వ్యవస్థ విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే..కేంద్రం.. ఈ అంశంలో వేగంగా స్పందించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close